అనంతపురం జిల్లాలో తెలుగుదేశంపార్టీ నేతల గురించి ఇపుడిదే అనుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ కు వైసీపీ ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య పెరిగిపోతున్న గొడవలు అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఈనాటివి కావు సర్దుబాటు అవ్వటానికి. అలాంటిది నాలుగు రోజుల క్రితం జేసీ ఇంటి మీదకు ఎంఎల్ఏ హఠాత్తుగా దాడి చేశారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ కొడుకు అస్మిత్ రెడ్డి కానీ ఇంట్లో లేరుకాబట్టి సరిపోయింది. ఉండుంటే ఏమయ్యేదో ?
సరే తనింటిపై మద్దతుదారులతో కలిసి ఎంఎల్ఏ దాడి చేసిన విషయం జేసీ తెలుసుకున్నారు. వెంటనే ఇంటికి చేరుకునే సమయానికే పోలీసులు జోక్యం చేసుకుని ఎంఎల్ఏ+మద్దతుదారులను అక్కడి నుండి పంపేశారు. ఇంటికి వచ్చిన జేసీ జరిగింది తెలుసుకుని తన మద్దతుదారులతో రెచ్చిపోవటంతో రెండువర్గాల మధ్య రాళ్ళయుద్ధమే జరిగింది. ఈ విషయమై ఇఫ్పటికీ నిప్పు రాజుకుంటుంనే ఉంది.
సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే జేసీ ఇంటిమీదకు వైసీపీ ఎంఎల్ఏ దాడి విషయాన్ని టీడీపీలోనే చాలా మంది సీనియర్ నేతలు అస్సలు పట్టించుకోలేదు. మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు తప్ప ఇంకో నేతెవరు పరామర్శ కూడా చేయలేదు. పరామర్శకాదు కదా కనీసం దాడిని ఖండిస్తు ఓ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. పార్టీలో జేసీ ఈ పరిస్దితికి వాళ్ళ స్వయంకృతమనే చెప్పాలి. జిల్లాలోని అందరి నేతలతోను గతంలో పెట్టుకున్న గొడవల వల్లే చాలామంది నేతలు జరిగిన దాడితో తమకు సంబంధం లేదన్నట్లుగా ఉండిపోయారు.
దాంతో జేసీలు ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి భోరుమన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమింటి మీదకు వైసీపీ ఎంఎల్ఏ దాడిచేస్తే కనీసం నేతలు ఖండనలు కూడా ఇవ్వలేదన్న విషయాన్ని జేసీ బ్రదర్స్ చంద్రబాబుతో ఫోన్లో ఫిర్యాదు చేశారట. దాంతో చంద్రబాబు జోక్యం చేసుకుని జిల్లాలోని సీనియర్లకు ఫోన్లు చేసి బాగా క్లాసు పీకినట్లు సమాచారం. అందుకనే రెండు రోజుల క్రితం వివిధ జిల్లాల నేతలతో జూమ్ యాప్ లో మాట్లాడిన చంద్రబాబు ప్రత్యేకంగా జేసీల గురించి ప్రస్తావించారు.
నేరుగా చంద్రబాబు నుండే క్లాసు పడటంతో కొందరు సీనియర్ నేతలు వైసీపీ ఎంఎల్ఏ పెద్దారెడ్డి దాడిని ఖండిస్తు ప్రకటనలు చేశారు. పరిటాల సునీత, శ్రీరామ్ తో పాటు పయ్యావుల తదితరులు పెద్దారెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటు డిమాండ్ చేశారు. అంటే చంద్రబాబు చెబితే కానీ జేసీలకు మద్దతుగా సీనియర్ నేతలెవరు మాట్లాడలేదంటేనే బ్రదర్స్ పరిస్దితి పార్టీలో ఎలాగుందో అర్ధమైపోతోంది.
This post was last modified on December 31, 2020 9:57 am
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…