ఏపీలో అధికార కూటమి రథసారధిగా ఉన్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో గత కొంతకాలంగా ఓ వినూత్న గోల తరచూ వినబడుతోంది. తాము అణగారిన వర్గాలమని చెబుతున్న రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు… తాము చేసిన తప్పు ఇతరులూ చేస్తున్నారని… వారిని వదిలేసి తమను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ సాగుతున్న ఈ గోల ఇటీవల మరింతగా ఎక్కువైందనే చెప్పాలి. తాము తప్పు చేయడం లేదన్న మాటను అంతగా ప్రస్తావించని సదరు నేతలు… ఇతర నియోజకవర్గాల్లో ఇదే తరహా తప్పు జరుగుతోందని.. దానిపై ఎందుకు చర్యలు తీసుకోరని మాత్రం అడుగుతున్నారు. నిజంగానే ఈ తరహా గోల వింతైనదే. మరి ఈ తరహా గోలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు అన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు) నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన థామస్ 2024లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని రోజులకే థామస్… తాను ఎస్సీ వర్గానికి చెందిన వాడినని, అందుకే తనను అందరూ టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మరోమారు మీడియా ముందుకు వచ్చిన థామస్… తనపై సొంత పార్టీకి చెందిన నేతలే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆయన వాపోయారు. తాను చేస్తున్నానని చెబుతున్న అవినీతిని అధికార పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలూ చేస్తున్నారని, మరి వారిపై చర్యలు తీసుకోరా? అని ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్భంగా థామస్ ప్రత్యేకించి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావించారు. చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా టీడీపీ సీనియర్ నేత పులివర్తి నాని కొనసాగుతుంటే… నగరి నుంచి గాలి భాను ప్రకాశ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారిద్దరూ మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని, వారి గురించి ఎవరూ మాట్లాడరేమిటని ఆయన ప్రశ్నిస్తున్న తీరు కలకలం రేపుతోంది.
ఇక ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ఇస్తున్న ర్యాంకులను కూడా థామస్ తప్పుబట్టారు. డబ్బు తీసుకుని ర్యాంకులు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ర్యాంకుల్లో తొలి మూడు స్థానాల్లో మీ పేరు ఉండాలంటే రూ.5 నుంచి రూ.10లక్షలు ఇవ్వాలని తననే నేరుగా డిమాండ్ చేశారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తాము ఎస్సీలమని, ఇప్పటిదాకా అణచివేయబడ్డామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తాము ఎదిగేందుకు అవకాశం ఇవ్వాలని, తమను వదిలేయాలని ఆయన చేసిన డిమాండ్ ఇప్పుడు కొత్త చర్చకు తెర లేపిందని చెప్పాలి.
This post was last modified on May 20, 2026 5:26 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…