Political News

బండి సంజయ్ కు సీఎం షాక్

కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు మత్తు మందిచ్చి రేప్ చేశాడంటూ భగీరథ్ పై 17 ఏళ్ల మైనర్ మే 8న కేసు పెట్టినా భగీరథ్ పై చర్యలు తీసుకోలేదని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

అంతేకాదు, హనీ ట్రాప్ అంటూ ఆ మైనర్ పై భగీరథ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు నుండి తప్పించుకునేందుకు తమ కూతురిపైనే బండి భగీరథ్ తప్పుడు కేసులు పెడుతున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, బండి సంజయ్, భగీరథ్ లను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. వాస్తవానికి పోక్సో కేసు పెట్టిన 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది.

కానీ, మూడు రోజులైనా భగీరథ్ ను అరెస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసుకు సంబంధించి లోతైన విచారణ చేపట్టాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మూడు రోజులైనా విచారణ ఎందుకు మొదలుకాలేదని సీవీ ఆనంద్ ను రేవంత్ ప్రశ్నించారు. అయితే, ప్రధాని మోదీ పర్యటన భద్రతా ఏర్పాట్లలో పోలీసులంతా బిజీగా ఉన్నారని ఆయన సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణ కోసం మహిళా డీజీపీ ఆధ్వర్యంలో సిట్ కూడా ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

This post was last modified on May 11, 2026 5:50 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Bandi Sanjay

Recent Posts

త్రిష చేతిలో బంపర్ ఆఫర్?

మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…

9 minutes ago

మాజీ సీఎం ఇంటికి కొత్త సీఎం… వాహ్!

తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు.…

49 minutes ago

పవన్‌తో బాలినేని సినిమా?

పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజవడం ఆయన అభిమానులకు అరుదైన…

3 hours ago

రాజసాబ్ చిన్న సినిమానా సప్తగిరి?

కొన్ని నెల‌లు వెన‌క్కి వెళ్తే.. ప్ర‌భాస్ సినిమా రాజాసాబ్ గురించి ఆ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి…

5 hours ago

విజ‌య్ సీఎం అయ్యాడు.. మ‌రి రాహుల్ ప్ర‌ధాని ఎప్పుడో?!

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాణ స్వీకార…

5 hours ago

ORRపై మరో విషాదం.. నటుడు.. కెమేరా మ్యాన్ బలి

ఈ నెల (మే) మొదటి రోజున హైదరాబాద్ కు చెందిన కుటుంబం.. సిరిసిల్లకు చెందిన మరో ఫ్యామిలీ కలిసి యాదాద్రి..…

6 hours ago