Movie News

రాజసాబ్ చిన్న సినిమానా సప్తగిరి?

కొన్ని నెల‌లు వెన‌క్కి వెళ్తే.. ప్ర‌భాస్ సినిమా రాజాసాబ్ గురించి ఆ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి చెప్పిన మాట‌లు అభిమానుల‌కు గుర్తుండే ఉంటాయి. ఆ చిత్రం అన్ని రికార్డులూ బ‌ద్ద‌లు కొట్టేస్తుంద‌ని, 2 వేల కోట్ల వ‌సూళ్లు సాధిస్తుంద‌ని గొప్ప‌లు పోయాడు స‌ప్త‌గిరి. తీరా చూస్తే ఆ సినిమా ప్ర‌భాస్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది.

స‌ప్త‌గిరి చెప్పిన దాంట్లో ప‌దోవంతుకు మించి వ‌సూళ్లు రాలేదు. అప్పుడు ఆ సినిమా గురించి అంత హైప్ ఇచ్చి ట్రోల్స్‌కు గురైన స‌ప్త‌గిరి.. ఇప్పుడు అదే మూవీ గురించి నోరుజారి మ‌ళ్లీ విమ‌ర్శ‌ల బారిన ప‌డ్డాడు. తాను ప్ర‌త్యేక పాత్ర పోషించిన పురుషః అనే సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో అత‌ను రాజాసాబ్‌ను చిన్న సినిమాగా అభివ‌ర్ణిస్తూ మాట్లాడ‌డం వివాదానికి దారి తీసింది.

మొద‌ట క‌మెడియ‌న్‌గా ప‌రిచ‌యం అయిన స‌ప్త‌గిరి.. త‌ర్వాత హీరోగా మారి కొన్ని సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట్లో లీడ్ రోల్స్ చేసిన సినిమాలు ఒక మాదిరిగా ఆడాయి కానీ, త‌ర్వాతి చిత్రాలు తేలిపోయాయి. దీంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్ పాత్ర‌ల్లోకి మారాడు సప్త‌గిరి. ఇక‌పై మ‌ళ్లీ హీరో పాత్ర‌లు చేయ‌రా అని అడిగితే.. చేస్తాన‌ని చెప్పిన సప్త‌గిరి, మూడు స‌బ్జెక్టులు రెడీ చేసిన‌ట్లు వెల్ల‌డించాడు.

ఈ క్ర‌మంలోనే అత‌ను మాట్లాడుతూ.. ఈ మ‌ధ్య చాలా వ‌ర‌కు చిన్న సినిమాలే చేశానంటూ వ‌రుస‌గా ఒక లిస్టు చెప్పాడు. అందులో స‌ర‌స్వ‌తి, కొక్కొర‌కో లాంటి చిత్రాల‌తో పాటు రాజాసాబ్‌ను కూడా చేర్చేశాడు స‌ప్త‌గిరి. అత‌ను స్ప‌ష్టంగా రాజాసాబ్‌ను చిన్న సినిమా అని చెప్ప‌డంతో ప్ర‌భాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

రిలీజ్‌కు ముందేమో అవ‌స‌రానికి మించి హైప్ ఇచ్చి.. ఇప్పుడు చిన్న సినిమా అని రాజాసాబ్‌ను తీసిప‌డేస్తావా అంటూ అత‌డిని ట్రోల్ చేస్తున్నారు. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం చూస్తే.. స‌ప్త‌గిరి ఈ వ్యాఖ్య‌ల‌పై సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేయ‌డ‌మో, సోష‌ల్ మీడియా పోస్టు పెట్ట‌డ‌మో చేయ‌క తప్పేలా లేదు.

This post was last modified on May 11, 2026 1:19 pm

Share

Recent Posts

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

6 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

5 hours ago