తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్…సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అంతటితో ఆగని విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. స్టాలిన్ ఇంటిని విజయ్ దర్శించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రస్తుత రాజకీయాల్లో సైద్ధాంతిక విభేదాలు వ్యక్తిగత విభేదాలుగా మారిపోయిన పరిస్థితి విస్పష్టంగానే కనిపిస్తోంది. గతంలో అయితే ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు చేసే నేతలు.. ఆ తర్వాత రాజకీయాలను పక్కనపెట్టేసి ఎంచక్కా అభివృద్ధిపై దృష్టి సారించేవారు. రాజకీయాల్లో పరస్పరం చేసుకున్న విమర్శలను ఆ తర్వాత వారు అంతగా పట్టించుకునే వారు కాదు.
అంతేకాకుండా ఆ విమర్శలు కూడా సైద్ధాంతిక విమర్శలుగానే ఉండేవి. అయితే నేడు సైద్ధాంతికం పక్కకెళ్లిపోయి… వ్యక్తిగత విమర్శలు వాటి స్థానాన్ని ఆశ్రయించాయి. ఫలితంగా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా నేతలు పరస్పరం వ్యక్తిగతంగా దూషించుకుంటూ సాగుతున్నారు.
ఈ తరహా వ్యక్తిగత రాజకీయాలను విజయ్ పక్కనపెట్టేశారని చెప్పాలి. ఎన్నికల ప్రచారంలోనూ ఆయా పార్టీలపై విజయ్ ఎక్కువగా నిందలేమీ వేయలేదు. ఆయా పార్టీల నేతలపైనా పెద్దగా విమర్శలే చేయలేదు. ఒకటి అరా సందర్భాల్లో విమర్శలు చేసినా… అవి సైద్థాంతిక పరిధులు దాటలేదనే చెప్పాలి. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేుగా ప్రమాణం చేసిన తర్వాత విజయ్ నేరుగా స్టాలిన్ ఇంటికి వెళ్లారు. తమ ఇంటికి వచ్చిన విజయ్ ని స్టాలిన్ కుటుంబం కూడా ఆత్మీయంగా ఆహ్వానించింది.
విజయ్ స్టాలిన్ ఇంటికి చేరగానే… మొన్నటిదాకా డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ బయటకు వచ్చి మరీ విజయ్ ను ఆలింగనం చేసుకున్నారు. విజయ్ ను ఆయన వెంట ఉండి మరీ లోపలికి తీసుకెళ్లారు. తన ఇంటిలోకి ప్రవేశించగానే విజయ్ ని స్టాలిన్ ఆత్మీయంగా పలకరించారు.
ఆ తర్వాత విజయ్ కి హగ్ ఇచ్చిన స్టాలిన్ కొత్త సీఎంను ఇంటిలోకి తీసుకెళ్లారు. పరస్పర అభివాదాలు ముగిశాక… వారిద్దరూ ఎదురెదురుగా కూర్చుని కబుర్లాడుకున్నారు. స్టాలిన్ తో విజయ్ మాట్లాడుతున్న సమయంలో ఆయన పక్కనే ఉదయనిది కూర్చుని కనిపించారు. మొత్తంగా ఈ భేటీతో విజయ్ వైరి వర్గాలను కూడా కలుపుకుని పోయేందుకు తనకేమీ అబ్యంతరం లేదన్న మాటను గట్టిగానే వినిపించినట్లైంది.
This post was last modified on May 11, 2026 6:32 pm
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…