Political News

మరో వివాదంలో బండి సంజయ్ కుమారుడు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో తాను చదువుతున్న కళాశాలలో ఓ జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన ఘటనలో బండి కుమారుడు భగీరథ్ అడ్డంగా బుక్కయ్యారు. తాజాగా ఓ బాలికను వేధించిన కేసులో భగీరథ్ పై ఏకంగా పోస్కో కేసే నమోదు అయిపోయింది. ఈ కేసులో బాదిత బాలిక స్వయంగా భగీరథ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా… ఆ బాలికతో పాటు బాలిక కుటుంబంపైనా హనీ ట్రాప్ ఆరోపణలతో భగీరథ్ ఫిర్యాదు చేశారు.

భగీరథ్ పై నమోదు అయిన కేసు వివరాల్లోకి వెళితే… ఇంకా మైనారిటీ కూడా తీరని బాలికతో భగీరథ్ స్నేహంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 31న మొయినాబాద్ పరిధిలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా బాలిక పట్ల భగీరథ్ అసభ్యంగా వ్యవహరించారట. అంతేకాకుండా ఆ బాలిక మద్యం సేవించేలా బలవంతం చేశారట. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. తాజాగా భగీరథ్ పై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గడచిన ఐదు నెలల్లో ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ… భగీరథ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథ్ పై పోస్కో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకునే దిశగా బాలిక, ఆమె కుటుంబం తనను లోబరచుకునే యత్నం చేశారంటూ ఆ బాలికపై భగీరథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భగీరథ్ పై కేసు నమోదు, ఐదు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం, తనపై ఫిర్యాదు చేసిన తర్వాత భగీరథ్ బాలిక, ఆమె కుటుంబంపై ఫిర్యాదు చేయడం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఇదిలా ఉంటే… రాజకీయంగా ఉచ్ఛ స్థితిలో బండి సంజయ్ ఉన్నారు. ఆది నుంచి బీజేపీలో కొనసాగుతున్న బండి… అంచెలంచెలుగా ఎదిగారు. అనూహ్యంగా ఎంపీ కావడం, ఆ వెంటనే ఆయనను కేంద్ర మంత్రి పదవి వరించడంతో ఒక్కసారిగా బండి సంజయ్ ప్రముఖ నేతగా ఎదిగారు. ఇలాంటి తరుణంలో ఆయన తన కుమారుడి వ్యవహార సరళి వల్ల ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉండగా… ఆయన కుమారుడిపై ఇప్పుడు పోస్కో కేసు నమోదు కావడంతో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on May 10, 2026 12:16 am

Share
Show comments
Published by
Kumar
Tags: Bandi Sanjay

Recent Posts

విజయ్‌కి దినదిన గండమేనా?

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మూణ్నాలుగు రోజులుగా నడుస్తున్న సస్పెన్సుకు తెరపడింది. ఎట్టకేలకు గవర్నర్ విజయ్‌కి అవకాశమిచ్చాడు. సొంతంగా…

5 hours ago

మోడీ విష‌యంలో… కేసీఆర్‌కు భిన్నంగా రేవంత్‌..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అనుస‌రిస్తున్న తీరు.. గ‌త ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌హ‌రించిన…

7 hours ago

తెలంగాణ‌పై మోడీ: అప్పుడొక మాట‌.. ఇప్పుడొక మాట‌.. ?

తెలంగాణ‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు ప‌ర‌స్ప‌ర విరుద్ధంగా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. గ‌తంలో ఆయ‌న పార్ల‌మెంటులో…

9 hours ago

తమిళ మంత్రి కీర్తన.. గతంలో టీడీపీకి..?

తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకత్వానికి కొత్త గుర్తింపుగా నిలిచిన టీవీకే నేత ఎస్. కీర్తన సంపత్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…

9 hours ago

విశ్వనాథ్ సన్స్ అంత రిస్కు చేస్తారా

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు…

10 hours ago

జగపతి… అది వదులుకొని ఇది పట్టుకున్నారా

హీరోగా అవకాశాలు ఆగిపోయిన టైంలో ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు సీనియర్ నటుడు జగపతిబాబు. దీంతో ఓవర్ నైట్…

12 hours ago