Political News

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ దుందుభి మోగించారు. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ టీవీకే నామమాత్రపు సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. కానీ, మాజీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే మాత్రం టీవీకే గెలుపును ఏడాది ముందుగానే అంచనా వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే… పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన రోజుల్లో పీకే అంచనాలకు చాలా విలువ ఉండేదు. 2014 లో బిహార్ లో నితీశ్ కుమార్ ను సీఎంగా, కేంద్రంలో మోదీని ప్రధానిగా నిలబెట్టడంలో పీకే తన వంతు పాత్రపోషించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్ ను. 2021 ఎన్నికల్లో బెంగాల్ లో మమతా బెనర్జీని, తమిళనాడులో స్టాలిన్ ను ముఖ్యమంత్రిని చేయడంలోనూ పీకే ముఖ్య పాత్ర పోషించారు.

అయితే, ఆ తర్వాత బిహార్ లో సొంత పార్టీ పెట్టి ఓటమి పాలవ్వడం. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా బాధ్యతల నుంచి తప్పుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో పీకే అంచనాలు పలుమార్లు తప్పాయి. కానీ, తమిళనాడు ఎన్నికల పలితాల విషయంలో మాత్రం పీకే చెప్పింది చెప్పినట్లు జరిగడంతో మరోసారి పీకే వార్తల్లో నిలిచారు.

టీవీకే ఒంటరిగా పోటీ చేస్తే విజయం సాధిస్తుంది అంటూ గత ఏడాది ఓ తమిళ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా పీకే చెప్పిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ మాట చెప్పిన వెంటనే ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..118 సీట్లు వస్తాయా అంటూ నవ్వు మొఖం పెట్టారు. దీంతో, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోవాలని.. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ వీడియో ప్లే చేయాలని ఆ యాంకర్ కు పీకే కౌంటర్
ఇచ్చారు.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో, పీకేలో ఇంకా పస తగ్గలేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, 2025లో టీవీకే తరఫున ఎన్నికల ప్రచార బాధ్యతల గురించి విజయ్ తో చర్చలు జరిపిన పీకే…ఆ తర్వాత మధ్యలో హ్యాండ్ ఇచ్చారన్న విషయంపై కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అన్న రీతిలో బీహార్ ఎన్నికల్లో పీకే పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతిని కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

అయితే తాను రాజకీయ వ్యూహకర్తగా రిటైర్ అయిపోయానని, కానీ, ఇక్కడ తన మిత్రుడు విజయ్ కోసం మాత్రమే వచ్చానని పీకే చెప్పారు. విజయ్ ఒక రాజకీయ నాయకుడు కాదని కాబట్టే అతనికి సలహాలు ఇచ్చేందుకు తాను వచ్చానని అన్నారు. అయితే తన సొంత పార్టీ బాధ్యతలు చూసుకునేందుకు బీహార్ వెళుతున్నానని అందుకే మధ్యలో వెళ్లి పోవాల్సి వచ్చిందని పీకే అప్పట్లో వివరణ ఇచ్చారు.

This post was last modified on May 4, 2026 8:49 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

4 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

9 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

11 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

11 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

13 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

14 hours ago