Political News

పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ వస్తున్న దీదీ… నాలుగో సారి మాత్రం ఓటమి బాటలో సాగుతున్నారు. వామపక్షాల నుంచి అధికార పగ్గాలను చేజిక్కించుకున్న దీదీ… బెంగాల్ లో తనకు తిరుగు లేదన్నట్లుగా వ్యవహరించారు. పాలనలో తనదైన నిర్ణయాలు తీసుకున్న దీదీ… ఆ నిర్ణయాల అమలులో చివరకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎదిరించిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తించింది. ఒంటెత్తు పోకడలతోనే సాగిన దీదీ… ఆ తరహా వైఖరి ఎప్పటికైనా తన పుట్టి ముంచుతుందని గ్రహించలేకపోయారు. ఈ వైఖరే ఇప్పుడు ఆమెను పదవీచ్యుతురాలిని చేస్తోందని చెప్పక తప్పదు.

15 ఏళ్ల క్రితం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాటి బుద్ధదేవ్ భట్టాచార్య పాలనతో పాటు మూడు దశాబ్దాల కమ్యూనిస్టల పాలనపై విసుగెత్తిన బెంగాలీలు ఒక్కసారిగా దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కు అధికార పగ్గాలు అప్పగించారు. అయితే వామపక్ష ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందుతుందని భావించిన బెంగాలీలకు తమ భావన తప్పని చాలా ఆలస్యంగా తెలిసిందని చెప్పక తప్పదు. సీబీఐ లాంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను బెంగాల్ లోకి అనుమతించకుండా దీదీ సర్కారు తీసుకున్న నిర్ణయం నాడు యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఆ సందర్భంగా సీబీఐ అధికారులపై తన పోలీసులతో దీదీ ఏ రీతిన ఇబ్బంది పెట్టిందన్న విషయాన్ని దేశం మొత్తం అలా కళ్లప్పగించి చూసింది.

కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారుతో తనకేదో బద్ధ శత్రుత్వం ఉన్నట్లుగా దీదీ ఊగిపోయిన వైనం కూడా ఆసక్తి రేకెత్తించిన అంశమే. అయితే అధికారంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ధిక్కారాన్ని అంతగా సహించలేరు కదా. ఆ విధంగానే కేంద్రంలోని అధికార కూటమి, ఆ కూటమి రథసారథి బీజేపీ మమత ధిక్కారాన్ని సహించలేకపోయింది. దీదీని ఓడించి తీరాలన్న కలితో బీజేపీ కదిలింది. కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో అమిత్ షా బెంగాల్ లో దీదీ ఓటమికి ప్రత్యేక ప్రణాళికను రచించి అమలు చేశారు. అందులో భాగంగా దీదీకి అప్పటిదాకా వెన్నుదన్నుగా నిలిచిన సువేందు అధికారి తృణమూల్ ను వీడి బీజేపీలో చేరారు. ఇప్పుడు దీదీ ఖాళీ చేయనున్న కుర్చీనే ఆయనే అధిరోహించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

ఓ వైపు బీజేపీ తనను అధికారం నుంచి దించేసే దిశగా పదునైన వ్యూహాలను రచిస్తూ సాగుతున్నా దీదీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారన్న వాదనలు లేకపోలేదు. అయితే బీజేపీ ఎత్తులను చిత్తు చేసే దిశగా వ్యూహాలు దీదీ వద్ద లేకుండాపోయాయన్న మరో వాదనా లేకపోలేదు. ఎంతసేపూ తనదైన శైలి ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ సాగిన దీదీ… తనకు పొంచి ఉన్న ముప్పును గమినించినా… దానికి విరుగుడు మంత్రాన్ని రచించుకోలేకపోయారు. చుట్టూ బీజేపీ గీసిన మంత్రాంగం తన పనిని తాను శరవేగంగా చేసుకుంటూ పోగా… ఒంటరిగా మిగిలిపోయిన దీదీ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం తప్పించి ఏమీ చేయలేకపోయారు. ఇదే తీరు ఇప్పుడు ఆమెను అధికారం నుంచి దించేస్తోందని చెప్పక తప్పదు.

This post was last modified on May 4, 2026 5:17 pm

Share

Recent Posts

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

1 hour ago

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

6 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

10 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

12 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

13 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

15 hours ago