బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి సోము వీర్రాజులో ఒక్కసారిగా దూకుడు పెరిగిపోయింది. నిజానికి బీజేపీ దూకుడంతా వీర్రాజు మాటల్లోనే కనిపిస్తోంది కానీ క్షేత్రస్ధాయిలో మాత్రం లేదన్న విషయం అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసిన విషయంలో కూడా వీర్రాజు ఎందుకింత దూకుడు ప్రదర్శిస్తున్నారు ? ఎందుకంటే తెలంగాణా బీజేపీకి ఏమాత్రం తీసిపోకూడదన్న ఏకైక టార్గెట్ తోనే వీర్రాజు పనిచేస్తున్నట్లు కమలంపార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.
నిజానికి పార్టీ పరంగా చూస్తే తెలంగాణాకు ఏపికి ఏమీ పోలికలేదనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ మొదటి నుండి ఏపితో పోల్చుకుంటే తెలంగాణాలో గట్టిగా ఉంది. చాలా కాలంగా సికింద్రాబాద్ ఎంపిని కమలంపార్టీ గెలుచుకుంటోంది. ఒకసారి ఓడిపోయినా మరో ఎన్నికల్లో గెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలవకపోయినా లోక్ సభకు మాత్రం కమలంపార్టీ చెప్పుకోదగ్గ ఓట్లను తెచ్చుకుంటోంది కాబట్టి.
ఈ కారణంగానే అప్పుడప్పుడైనా బీజేపీ సికింద్రాబాద్ లోక్ సభలో గెలుస్తోంది. ఒకపుడు బండారు దత్తాత్రేయ గెలిచేవారు. ఇపుడు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి గెలిచారు. అలాగే గ్రేటర్ పరిధిలో కూడా అక్కడక్కడ బీజేపీ ఎంఎల్ఏలు గెలుస్తునే ఉన్నారు. కాకపోతే ఇపుడు బండి సంజయ్ వ్యవహార శైలి వల్ల పార్టీకి ఒక్కసారిగా ఊపొచ్చింది. దాంతోపాటు కాలం కూడా కలిసొచ్చి దుబ్బాక ఉపఎన్నికతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించింది. కాబట్టి తెలంగాణాలో బండి ఏమి మాట్లాడినా చెల్లుబాటైపోతోంది.
ఇక ఏపి విషయానికి వస్తే దేశమంతా బీజేపీ గాలి వీచినపుడు మాత్రమే ఎక్కడైనా ఎంపిలు లేకపోతే ఎంఎల్ఏ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తోంది. 2014లో నరేంద్రమోడి గాలితోనే రెండు ఎంపి సీట్లు, నాలుగు ఎంఎల్ఏ సీట్లు గెలిచింది. అంతకుముందు అప్పుడెప్పుడో కార్గిల్ యుద్ధం గాలిలో వాజ్ పేయి హయాంలో గెలిచిందంతే. మొన్నటి మోడి గాలిలో ఇతర రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించినా ఏపిలో మాత్రం ఒక్కసీటులోను గెలవలేదు.
ఇలాంటి పార్టీకి అధ్యక్షునిగా ఉన్న వీర్రాజు వ్యక్తిగా తాను మాత్రం దూకుడు మీదున్నారు. పైగా తెలంగాణాలో పార్టీతో పోల్చి చూసుకుంటున్నట్లు కమలనాదులే చెబుతున్నారు. తెలంగాణాలో పార్టీ దూకుడు మీదున్నట్లే ఏపిలో కూడా దూకుడుతో పరిగెత్తించాలని ప్రయత్నిస్తున్నట్లు పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. జాతీయస్ధాయిలో కూడా ఏపిని తెలంగాణాతో పోల్చి చూస్తున్నారట. దాంతో వీర్రాజుపై అనివార్యంగా తెలంగాణా ఒత్తిడి పెరిగిపోతుందని సమాచారం. అందుకనే తానే కాకుండా పార్టీని కూడా పరుగులు పెట్టించాలని ప్రయత్నిస్తున్నారు. మరి సాధ్యమేనా ?
This post was last modified on December 28, 2020 6:08 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…