వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా ఉండనున్నారు. అయితే.. ఇదేసమయంలో కీలక నాయకుల అరెస్టుకు పోలీసులు రంగం రెడీ చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. వీరిలో ఒక మాజీ మంత్రి కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో ఇద్దరు కీలక నాయకులు కూడా అరెస్టు కాక తప్పదని కూడాపార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఎవరెవరు?
గుడివాడ మాజీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు కావడం ఖాయమని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వాస్తవానికి ఆయనను కూటమి ప్రభుత్వం రాగానే అరెస్టు చేశారన్న వాదన వినిపించింది. కానీ, ఇతర నాయకులను వివిధ కేసుల్లో అరెస్టు చేసినా.. కొడాలి విషయంలో అడుగులు ముందుకు పడలేదు. అరెస్టు చేయాలని అనుకుంటే ప్రభుత్వం దగ్గర భారీగానే కేసులు ఉన్నాయి. కేసినో నిర్వహణ నుంచి పేకాట క్లబ్బుల నిర్వహణ వరకు.. దూకుడుతో చేసిన వ్యాఖ్యల నుంచి టీడీపీ నేతల బెదిరింపుల దాకా అనేక కేసులు ఉన్నాయి.
కానీ, ఇప్పుడు వాటిని పక్కన పెట్టిన కూటమి ప్రభుత్వం.. స్థానికంగా జరిగిన ఓ అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు రెడీ అయింది. దీనిపై అధికారులు ఇప్పటికే రంగం రెడీ చేశారని సమాచారం.
ఇక, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబును ఆయన మాజీ డ్రైవర్ హత్య, శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనకు సంబంధించి కూడా.. అరెస్టు పర్వం రెడీ అయిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అనంత బాబు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇక, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు కూడా ఈ వారంలోనే జరుగుతుందని పోలీసు వర్గాలు చెబు తున్నాయి. ఇటీవల ఆయన కలెక్టర్ కార్యాలయం ముందు చేసిన నిరసనకు.. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు సహా.. అనుమతులు లేకుండా చేసిన నిరసన దీక్షపైనా కేసు నమోదు చేశారు.
దీనిపై ఈ వారంలోనే చర్యలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇలా.. ఈ వారంలో ముగ్గురు కీలక నాయకులను అరెస్టు చేయొచ్చని.. వైసీపీలోనూ చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుంది? వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది? అనేది చూడాలి.
This post was last modified on April 23, 2026 10:04 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…