ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ.. ఎవరికి వారు పార్టీలో స్వతంత్ర నాయకులుగా వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. ఇది .. పార్టీని ముందుకు తీసుకువెళ్లకపోగా.. మరింత వెనక్కి నెడుతోందని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కన్నబాబును ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా నియమించిన తర్వాత.. పార్టీలో సహకారం కొరవడింది. దీంతో ఆయనను కేవలం విశాఖకు పరిమితం చేశారు.
అయినా కూడా బొత్స సత్యనారాయణ సామాజిక వర్గం పార్టీలో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతోంది. జిల్లాల పరంగా చూసుకుంటే.. టీడీపీ, జనసేనలకు ఉన్న బలం వైసీపీకి కనిపించడం లేదు. విశాఖలో ఎంపీ భరత్ సహా టీడీపీ సీనియర్లు.. పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. కానీ, ఇదేసమయంలో వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపించే గుడివాడ అమర్నాథ్ వంటి వారికి పార్టీలో సహకారం అంతంత మాత్రమేనన్నది సీనియర్లే చెబుతున్నారు.
ఇక, శ్రీకాకుళంలో ధర్మాన సోదరులపైనే వైసీపీ ఆధారపడింది. మాజీ మంత్రిసీదిరి అప్పలరాజును వైసీపీ నాయకులు పక్కన పెట్టేశారు. మరోవైపు.. ఇదే జిల్లాలో జనసేన, టీడీపీ తరఫున కింజరాపు ఫ్యామిలీ సహా.. ఇతర నాయకులు బలంగా పార్టీ లను ముందుకు తీసుకువెళ్తున్నారు. వీరి దెబ్బతో వైసీపీ ఎక్కడా పుంజుకునే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. పోనీ.. పాత నాయకులు అయినా.. బయటకు వస్తున్నారా? అంటే.. కేవలం మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారు.
ఇక, విజయనగరంలో వైసీపీ చీలికలు పేలికలుగా తయారైందన్నది పార్టీలో కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది. జిల్లాలో బొత్స ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ద్వారా.. వైసీపీ పెద్ద పొరపాటు చేసిందన్న వాదన వినిపిస్తోంది. ఇక, ఇదేజిల్లాలో జనసేన భారీగా పుంజుకుంటోంది. దీనికి టీడీపీ సహకారం కూడా తోడైంది. దీంతో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలోనూ.. వైసీపీ వర్గ పోరుతో ముందుకు సాగలేక.. వెనక్కి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటే.. జనసేన+టీడీపీ ఉమ్మడిగా జిల్లాలను దున్నేసే పరిస్థితి నెలకొంది.
This post was last modified on April 21, 2026 9:50 am
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…