బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు. అదేవిధంగా ఆయన కుటుంబం కూడా దాదాపు 40 సంవత్సరాలకు పైగానే రాజకీయాల్లో ఉంది. ఈ కుటుంబం గురించి పక్కన పెడితే బీహార్లో బిజెపి ప్రస్థానం ప్రారంభం కావడం, ఏకంగా ఇప్పుడు అధికారం దక్కించుకునే వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే అనేక ఆశ్చర్యకర విషయాలు కనిపిస్తాయి.
గతంలో కేవలం ఒకటి రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైన బిజెపి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేవలం పొత్తులకు మాత్రమే పరిమితం అవుతామని.. ప్రకటించింది. అంతేకాదు బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వమే ఐదు సంవత్సరాలు కొనసాగుతుందని కూడా ఎన్నికల సమయంలో చెప్పింది. అటువంటి పార్టీ ఎన్నికల జరిగి కనీసం 6 నెలలు కూడా గడవక ముందే అధికారాన్ని దక్కించుకోవడం ముఖ్యమంత్రి పీఠంపై తనదైన ముద్ర వేయడం వంటివి ఆశ్చర్యకరంగా మారాయి.
ఉర్దూలో ఒక సామెత ఉంది `తలదాచుకోవడానికి ఒంటెకు చోటిస్తే మొత్తం గుడారాన్ని లేపేసింది` అని అంటారు. ఇప్పుడు బీజేపీ వ్యవహారం కూడా అలాగే ఉంది. ఒకప్పుడు తమతో పొత్తు పెట్టుకోవడానికి కూడా పార్టీలు సహకరించని పరిస్థితి బీహార్‌లో బీజేపీకి కనిపించింది. ఎందుకంటే బీహార్ అనేది అనేక సామాజిక వర్గాల సమాహారంతో నిండిన రాష్ట్రం. ముఖ్యంగా బీసీలు, మైనారిటీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. బీహార్ మత చాంద్రసానికి, మతతత్వ పార్టీలకు అవకాశం ఇవ్వలేదు.
అటువంటి సమయంలో పొత్తులు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేని బిజెపి నెమ్మది నెమ్మదిగా విజృంభించి ఇప్పుడు ఏకంగా అధికారాన్ని దక్కించుకుంది. వాస్తవానికి గత ఎన్నికలకు- ఇప్పుడు అధికారం దక్కించుకోవడానికి ఈ మధ్య జరిగిన పరిణామాలను గమనిస్తే.. బీహార్ ప్రజలు నితీష్ కుమార్ ను చూసి ఓటేశారు అన్నది వాస్తవం. కానీ ఆరు మాసాలు కూడా తిరగకుండానే అదే నితీష్ కుమార్ ను రాజ్యసభకు పంపించి, రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఈరోజు బిజెపి అవతరించింది.
దీనివల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉంటుంది అంటే రాజకీయంగా చూసుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీయు నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఇతర ప్రాంతీయ పార్టీలుగా ఉన్న ఆర్జెడి వంటివి కూడా దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. బిజెపి విషయంలో ఇది కొత్త కాదు. గతంలో అస్సాంలోను ఇదే తరహా రాజకీయాలు కనిపించాయి. అక్కడ కూడా ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టిన బిజెపి ఆ పార్టీలను మచ్చిక చేసుకుని నెమ్మది నెమ్మదిగా అధికారంలోకి వచ్చింది.
గడిచిన 10 సంవత్సరాల్లో ఆ పార్టీ అక్కడ అధికారంలో కొనసాగుతోంది. అయితే వాస్తవానికి తొలిసారి అస్సాంలో కూడా బిజెపిని చూసి ఎవరూ ఓటేయలేదు. స్థానికంగా ఉన్న పార్టీ బోడోలాండ్ ను చూసి ఓటేశారు. ఆ పార్టీని నెమ్మదిగా బిజెపిలో విలీనం చేసుకుని అధికారం దక్కించుకుంది. ఇక్కడ మరో చిత్రమైన విషయం ఏమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న విషయాన్ని పక్కన పెడితే రాష్ట్రాల్లో అధికారం చేపడుతున్న బిజెపి ఇరుగుపొరుగు పార్టీల నుంచి వచ్చిన వారిని ముఖ్యమంత్రులు చేయటం ఆసక్తికర విషయం.
ఉదాహరణకు అస్సాంలో సీఎంగా ఉన్న హిమంత విశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఆయన్ని చూసే అక్కడ బిజెపి డెవలప్ అయింది. ఇక ఈయనకు ఆర్ఎస్ఎస్ మూలాలు కూడా ఏమీ లేదు. బిజెపి నుంచి వచ్చారు కాబట్టి సహజంగా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉంటాయని అనుకుంటారు. కానీ హిమంతకు ఆర్ఎస్ఎస్ మూలాలు ఏమీ లేవు. అదే విధంగా ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సామ్రాట్ చౌదరికి కూడా ఎటువంటి ఆర్ఎస్ఎస్ మూలాలు లేవు.
పైగా ఈయన కూడా ఆర్జెడి సహా జెడియుల నుంచి వచ్చిన నాయకుడు. ఈ రెండు పార్టీలు మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీలు కావడం విశేషం. అదేవిధంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బిజెపి కనుక విజయం దక్కించుకుంటే అక్కడ కూడా కాంగ్రెస్ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో చేరి.. తర్వాత బిజెపిలోకి వచ్చిన సుభేందు అధికారిని ముఖ్యమంత్రిగా చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా బిజెపిని గమనిస్తే ప్రాంతీయ పార్టీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.
This post was last modified on April 15, 2026 7:53 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…