Political News

మావిగ‌న్‌కు చెక్‌… అమ‌రావ‌తి `అష్ట` దిగ్బంధం!

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన మావిగ‌న్‌(మ‌చిలీప‌ట్నం+విజ‌య‌వాడ‌+గుంటూరు న‌గ‌రాల‌నుక‌లుపుతూ ఏర్పాటు చేసే రాజ‌ధాని)పై పెద్ద ఎత్తున వివాదం లేచిన నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా అమ‌రావ‌తిని మ‌రింత ప‌టిష్టం చేసేలా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అమ‌రావ‌తి రాజ‌ధానిని పూర్తిగా ఎనిమిది(అష్ట‌) జోన్లుగా విభ‌జింది. దీంతో మావిగ‌న్ ప్రాంతాలు స‌హా.. మ‌రిన్ని ప్రాంతాలు ఈ రాజ‌ధాని ప‌రిధిలోకి వ‌చ్చాయి. ఫ‌లితంగా మొత్తం రాజ‌ధాని ప్రాంతం 8,352.69 చదరపు కిలోమీటర్లకు చేరుతుంది. త‌ద్వారా రేపు ప్రాంతీయ విభేదాలు కానీ.. మావిగ‌న్ ప్ర‌తిపాద‌న కానీ తెర‌మీద‌కు వ‌చ్చే అవ‌కాశం లేకుండా చ‌ర్య‌లు తీసుకుంది.

ఇవీ జోన్‌లు..

మ‌ధ్య‌, ప‌శ్చిమ‌, ఉత్త‌ర‌, ఈశాన్య‌, తూర్పు, ద‌క్షిణ‌, ఆగ్నేయ‌, నైరుతి జోన్లుగా అమ‌రావ‌తి రాజ‌ధానిని పేర్కొంది. ఆయా జోన్ల ప‌రిధిలోకి వ‌చ్చే ప్రాంతాల‌ను కూడా ప్ర‌భుత్వం వివ‌రించింది. దీనిలోకి వ‌చ్చే అన్ని ప్రాంతాలు కూడా అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌రిధిలోనే ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది.

జోన్‌ల వారీగా..

1) సెంట్ర‌ల్‌(మ‌ధ్య‌) జోన్‌: రాజధాని అమరావతి నగరం – విజయవాడ నగరాలు ఉంటాయి. ఈ జోన్‌లో ప్రధాన నగరాలు, మండలాలు ఉంటాయి. దీనిలో రాజధాని నగరం 217 చద‌ర‌పు కిలో మీట‌ర్ల మేర‌కు ఉంటుంది. మిగిలిన ప్రాంతం విజయవాడ నగరం.

2) వెస్ట్రన్(ప‌శ్చిమ‌) జోన్: అమ‌రావ‌తికి పశ్చిమ దిశలో ఉన్న కృష్ణా జిల్లా, ఎన్.టీ.ఆర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి.

3) నార్తర్న్(ఉత్త‌ర‌) జోన్: రాజ‌ధాని ప్రాంతానికి ఉత్తరం దిక్కుగా ఉన్న మైలవరం, నూజివీడు ప్రాంతాలను దీనిలో చేర్చారు.

4) నార్త్ ఈస్ట్(ఈశాన్య‌) జోన్ : గన్నవరం ఎయిర్‌పోర్ట్ స‌హా ప‌లు గ్రామాలు దీనికి పరిధిలోకి వస్తాయి.

5) ఈస్ట్రన్(తూర్పు) జోన్: కృష్ణా జిల్లాలోని ప్రధాన వ్యవసాయ, వాణిజ్య ప్రాంతాలైన ఉయ్యూరు, పెన‌మ‌లూరు, కంకిపాడు వ‌ర‌కు దీనిలో చేర్చారు.

6) సౌత్ వెస్ట్(నైరుతి) జోన్ : పల్నాడు, గుంటూరు జిల్లాలలోని కీలక ప్రాంతాలను ఈ జోన్‌లో క‌లిపారు. ఇవి కూడా రాజ‌ధానికి అనుసంధానంగా సీఆర్ డీఏ ప‌రిధిలో ఉంటాయి.

7) సదరన్(ద‌క్షిణ‌) జోన్ : గుంటూరు సిటీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను ఈ జోన్‌లో చేర్చారు. దీంతో గుంటూరు న‌గ‌రంలోని మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పార్ల‌మెంటు స్థానం కూడా ఈ ప‌రిధిలోకి వ‌స్తుంది.

8) సౌత్ ఈస్ట్ (ఆగ్నేయ‌)జోన్ : బాపట్ల, గుంటూరు జిల్లాల పరిధిలోని డెల్టా ప్రాంతాల‌ను ఈ జోన్‌లో చేర్చారు.

మ‌రిన్ని విష‌యాలు..

+ సీఆర్‌డీఏ పూర్తి విస్తీర్ణం: 8,352.69 చదరపు కిలోమీటర్లు.

+ అమరావతి నగర విస్తీర్ణం: 217 చదరపు కిలోమీటర్లు.

+ జిల్లాల ప‌రిధి: గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలు.

This post was last modified on April 16, 2026 10:18 am

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

3 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

4 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

4 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

6 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

8 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

8 hours ago