వైసీపీలో తొలిసారి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు ఏమవుతుందంటూ.. పెద్ద ఎత్తున ఆరా తీయడం గమనార్హం. తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. ప్రత్యేకంగా ఒకరిద్దరు నాయకులు హైదరాబాద్‌కు వెళ్లి మరీ ఈ కేసు విచారణ సమయంలో కోర్టుకు హాజరయ్యారని తెలిసింది. వివేకా కేసు ఏమవుతుంది? మళ్లీ మొదటికి వస్తుందా? అనే విషయాలపై పార్టీ కార్యాలయం ఎప్పటికప్పుడు ఆరాతీసినట్టు తెలిసింది. కోర్టు విచారణను కూడా లైవ్‌లో తెలుసుకున్నట్టు సమాచారం.
విషయం ఏంటి?
2019 ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డిని ఆయన నివాసంలోనే దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ.. దీనిపై దర్యాప్తు ముగిసినట్టు.. తెలంగాణ హైకోర్టుకు తేల్చి చెప్పింది. అయితే.. ఈ కేసులో తనకు ఇంకా అనుమానాలు ఉన్నాయని.. నాటి నిందితుల్లో కొందరిని సీబీఐ అసలు విచారించలేదని పేర్కొంటూ.. వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని గత నెలలోనే విచారించిన సుప్రీంకోర్టు.. సీబీఐ వాదనలతో ఏకీభవించింది. విచారణ జరిపేందుకు ఏమీ లేదని.. అన్ని కోణాల్లోనూ విచారించామని సీబీఐ చెబుతోందని వ్యాఖ్యానించింది.
అయినప్పటికీ.. పిటిషనర్ సునీత వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. మరోసారి ఈ విషయంపై దృష్టి పెట్టాలని తెలంగాణ హైకోర్టును(ఈ కేసును విచారిస్తున్న న్యాయస్థానం) ఆదేశించింది. దీంతో సోమవారం ఈ కేసు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది.
సీబీఐ మాత్రం గత వాదనలే వినిపించింది. సునీత కోరినట్టుగా అన్ని కోణాల్లోనూ విచారించామని పేర్కొంది. విచారించేందుకు ఇక, అవకాశం కూడా లేదనిస్పష్టం చేసింది. అయినప్పటికీ.. మరోసారి దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇస్తామని కోర్టుకు విన్నవించింది. దీంతో కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు సీబీఐకి అవకాశం ఇచ్చింది.
సునీత వాదనేంటి?
వివేకా కుమార్తె.. సునీత వాదన వేరేగా ఉంది. అన్ని కోణాల్లోనూ విచారణ చేశామని సీబీఐ చెబుతున్నా.. నాడు.. వివేకా గుండెపోటుతో మృతి చెందారంటూ.. జగన్, భారతిలకు ఫోన్లు చేసిన వారిని.. ఈ సందేశాలను పంపించిన వారిని విచారించాలని పట్టుబడుతున్నారు.
అయితే.. వారిని ఇప్పటికే విచారించామని.. దీనిలో వారి పాత్ర ఏమీలేదని కేవలం సమాచారం మాత్రమే పంచుకున్నారని సీబీఐ వివరించింది. వీరిని అరెస్టు చేయాల్సినంత నేరం కూడా చేయలేదని స్పష్టం చేసింది. కానీ, సునీత మాత్రం వివేకా హత్య కేసును మరోసారి విచారించాలని పట్టుబడుతున్నారు. దీంతో కోర్టు కనుక ఆమేరకు ఆదేశాలు ఇస్తే.. విచారణ మళ్లీ జరిగే అవకాశం ఉంది. ఇదే విషయంపై వైసీపీ ఉత్కంఠకు గురైంది.
This post was last modified on April 14, 2026 2:03 pm
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…
సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…