Political News

`లీకు` మంత్రులు బాబుకు దొరికిపోయారా?

త‌న మంత్రి వ‌ర్గంలోని స‌భ్యుల వ్య‌వ‌హార శైలిపై సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. వారు త‌మ ప‌నుల‌ను స‌రిగా నిర్వ‌హించ‌డం లేద‌ని.. ప‌నితీరును మెరుగు ప‌రుచుకోవాల‌ని ఆయ‌న సూచిస్తున్నారు. అయితే.. ఇదంతా కూడా.. పాల‌న‌లో స‌హ‌జ‌మే కాబ‌ట్టి అంద‌రూ వింటున్నారు. కొంద‌రు స‌రిచేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు లైట్ తీసుకుంటున్నారు. అయితే.. పాల‌న‌కు సంబంధించిన అంశాలు.. ముఖ్యంగా మంత్రి వ‌ర్గ స‌మావేశాల‌కు ముందు.. అజెండా అంశాల‌ను లీక్ చేస్తున్న‌వారిపై చంద్ర‌బాబు తాజాగా సీరియ‌స్ అయ్యారు.

ముఖ్యంగా ప్ర‌త్య‌ర్థి వ‌ర్గానికి చెందిన మీడియాకు మంత్రి వ‌ర్గ అజెండా అంశాలు ముందుగానే తెలిసి పోవ‌డంపై చంద్ర‌బాబు త‌ల ప‌ట్టుకుంటున్నారు. గ‌త రెండు మూడు సంద‌ర్భాల్లో మంత్రి వ‌ర్గ స‌మావేశానికి ముందే… ప్ర‌త్య‌ర్థి వ‌ర్గానికిచెందిన మీడియాలో ఆయా అంశాల‌పై చ‌ర్చ పెట్టారు. మంత్రివ‌ర్గం ఆ కంపెనీకి భూములు ఇస్తోంద‌ని.. ఈ కంపెనీల‌కు రాయితీలు ఇస్తోంద‌ని బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై కూపీ లాగిన చంద్ర‌బాబు పైకి పేర్లు చెప్ప‌కుండానే.. మంత్రుల‌కు తాజాగా నోట్ పంపారు. లీకులు చేయ‌డం త‌గ‌ద‌ని చెప్పారు. అంతేకాదు.. ఇక‌పై ఉపేక్షించేది కూడా లేద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా గ‌తంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. వార్షిక బ‌డ్జెట్ ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్ట‌డానికి ముందే దీనిలోని కీల‌క విష‌యాల‌ను కొంద‌రు మంత్రులు బ‌య‌ట‌కు ప్ర‌చారం చేశారు. వాస్త‌వానికి ఇప్పుడున్నంత సోష‌ల్ మీడియా, యూట్యూబ్‌వంటివి అప్ప‌ట్లో లేవు.

అయిన‌ప్ప‌టికీ.. అప్ప‌టి సీఎం ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు. మంత్రివ‌ర్గం మొత్తాన్నీ ర‌ద్దు చేశారు. ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు తాను కూడా ఇక‌పై ఇలానే చేయాలా? అని ప్ర‌శ్నించారు. మంత్రివ‌ర్గంలో నిర్ణ‌యాలు తీసుకున్న త‌ర్వాత ఒక విధానంప్ర‌కారం సంబంధిత మంత్రి వాటిని మీడియాకు చెప్పాల‌ని ఆదేశించారు.

This post was last modified on April 14, 2026 8:54 am

Share

Recent Posts

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

12 minutes ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

1 hour ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

3 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

5 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

6 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

6 hours ago