Political News

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి… తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చుకుంది. అయితే ఈ పరిణామం ఆ పార్టీకి తీరని నష్టం చేసిందనే చెప్పాలి. అసలు పార్టీ పేరులోని తెలంగాణ పదాన్ని తొలగిస్తున్న తీరును ఆ పార్టీ కేడర్ ఓ రేంజిలో వ్యతిరేకించినా పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదు. పార్టీ పేరు మారిన తర్వాత జరిగిన 2023 ఎన్నికల్లో పార్టీ పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. ఈ విషయాన్ని గ్రహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తాజాగా పాత పేరునే కొనసాగించే దిశగా చర్యలు చేపడతామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మనసులో చాలా కాలంగా దాగి ఉన్న విషయాలను ఆయన ఈ సందర్భంగా బయటకు వెల్లడించారు. టీఆర్ఎస్ పేరును వదిలి దాని స్థానంలో బీఆర్ఎస్ పేరును పెట్టిన వైనం తమకు తీరని నష్టం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారిన తర్వాత పార్టీ నష్టపోయిందని, ఎన్నికల్లో ఓడిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. జరిగిన పొరపాటును సరిదిద్దే క్రమంలో భాగంగా తిరిగి పార్టీకి టీఆర్ఎస్ ను కొనసాగించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ కు తెలియజేసి…ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటామని కేటీఆర్ తెలిపారు.

ఇక వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని కేటీఆర్ వెల్లడించారు. బీజేపీతో అయితే అసలే పొత్తు అన్న మాటే ఉండదని ఆయన అన్నారు. పార్టీకి, కేడర్ కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపడతామని, అందులో భాగంగా తాను 2027లో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీతో కేడర్ కు ఏర్పడ్డ గ్యాప్ వల్లే ఓడిపోయామని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి అయినా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ అన్నారు.

మీడియా మీట్ లో భాగంగా తన సోదరి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురించి కూడా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ ఆడపడచు కూడా తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టదన్న కేటీఆర్… తన కుటుంబాన్ని కవిత ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కవిత తన బాధ్యతను మరిచి తమ కుటుంబాన్ని ఏడిపిస్తున్నారని వ్యాఖ్యానించిన కేటీఆర్… ఇకనైనా కవిత ఏడిపించవద్దని కోరారు.

This post was last modified on April 12, 2026 7:32 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

2 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

4 hours ago