Movie News

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్ చ‌ర‌ణ్‌, కొణిదెల నిహారిక‌ల పేర్లు వాడుతూ ఇటీవ‌ల ఒక కామెడీ షోలో అనుదీప్ క‌టికల అనే స్టాండ‌ప్ క‌మెడియ‌న్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే.

ఆ వీడియో వెంట‌నే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డం.. మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హంతో స్పందించ‌డం.. ఈ వ్య‌వ‌హారం పెద్ద వివాదంగా మార‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. సోష‌ల్ మీడియా ట్రోల్స్‌తో స‌రిపెట్ట‌కుండా.. అనుదీప్ కోసం అత‌ను షోలు చేసే ప్ర‌దేశానికి కూడా వెళ్లి మెగా ఫ్యాన్స్ త‌మ ఆగ్ర‌హాన్ని చూపించారు. ఫ్యాన్స్ కోపం అర్థ‌మైన అనుదీప్.. రెండు రోజులుగా బ‌య‌టికి రాకుండా ఉండిపోయాడు. ఇప్పుడ‌త‌ను త‌న వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.

త‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేసిన అనుదీప్.. వాటి వ‌ల్ల మ‌నోభావాలు దెబ్బ తిన్న వారికి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌న్నాడు. త‌న‌కు దురుద్దేశాలేవీ లేవ‌ని అత‌ను స్ప‌ష్టం చేశాడు. ఐతే అనుదీప్ క్ష‌మాప‌ణ వీడియో విష‌యంలోనూ మెగా ఫ్యాన్స్ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

అంత దారుణ‌మైన కామెంట్లు చేసి, మ‌ళ్లీ త‌న‌కు వేరే ఉద్దేశాలు లేవ‌న‌డం ఏంట‌ని.. అత‌ను బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. టీవీ స్కిట్లు అయినా, స్టాండ‌ప్ షోలు అయినా.. న‌వ్వించే క్ర‌మంలో హ‌ద్దులు దాటితే ఏమ‌వుతుందో చెప్ప‌డానికి ఇది మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది.

ముఖ్యంగా ఫిలిం సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కుల గురించి కామెంట్లు చేసేట‌పుడు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఈ ఉదంతం సూచిస్తోంది. తెలుగులో స్టాండ‌ప్ షోల క‌ల్చ‌ర్ త‌క్కువే. ఈ విష‌యంలో హిందీ వాళ్ల‌ను అనుక‌రించ‌డానికి మ‌న వాళ్లు ప్ర‌య‌త్నిస్తుంటారు.

ఐతే ఉత్త‌రాదిన ఫిలిం స్టార్ల మీద పంచులు వేసినా చెల్లిపోతుంది. కానీ ఇక్క‌డ అలా ఉండ‌దు. స్టార్ హీరోల‌కు భారీగా అభిమాన గ‌ణం ఉంటుంది. వాళ్లు చాలా ఆర్గ‌నైజ్డ్‌గా కూడా ఉంటారు. ఫ్యాన్ క‌ల్చ‌ర్ బ‌లంగా ఉండే చోట ఇలా హీరోల‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తే గ‌ట్టి ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌వు. దీని వ‌ల్ల కెరీర్లు ప్ర‌మాదంలో ప‌డ‌డ‌మే కాదు.. భ‌ద్ర‌త‌కు కూడా ముప్పు వాటిల్లుతుంద‌నడానికి అనుదీప్ ఉదంతమే రుజువు.

This post was last modified on April 12, 2026 8:48 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

20 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

1 hour ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

1 hour ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago