Political News

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్ పెడితే చాలు ట్రోలర్లు పండగ చేసుకుంటున్నారు. జగన్ నోటి నుంచి జాలువారే ఆణిముత్యాల కోసం వారంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే, వారిని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి టంగ్ స్లిప్ అయి దొరికిపోతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా నెటిజనులకు జగన్ మరోసారి అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్రాలకు రాజధాని ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా రాసి లేదని జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దేశాలకు మాత్రమే రాజధాని ఉంటుందని, ఆ విషయం రాజ్యాంగంలో రాసి ఉందని జగన్ సెలవిచ్చారు. కానీ, చంద్రబాబు మాత్రం ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత అంటూ డ్రామాలాడుతున్నారని జగన్ విమర్శించారు. దోపిడీ పాలనను కప్పిబుచ్చేందుకే చంద్రబాబు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాలకు రాజధాని అన్నది రాష్ట్రాలకు సంబంధించిన విషయం అని, అందులో కేంద్రం జోక్యం ఉండబోదని ఏపీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ కూడా దాఖలు చేసిందని జగన్ అన్నారు.

రాష్ట్ర రాజధానికి సంబంధించిన తీర్మానం అవసరం లేదని మంత్రి స్వయంగా అన్నారని జగన్ గుర్తు చేశారు. రాజధాని అమరావతి కోసం చట్టం చేస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారని, రేపు అదే చట్టసభలో చట్ట సవరణ చేయొచ్చని చంద్రబాబుకు తెలియదా అని జగన్ ప్రశ్నించారు. దీన్ని బట్టి అమరావతిని జగన్ ఇంకా వ్యతిరేకిస్తున్నారని స్వయంగా ఆయనే ఒప్పుకున్నట్లయింది.

అయితే, మరోసారి ఇలా సీఎం చంద్రబాబును విమర్శించబోయి జగన్ సెల్ఫ్ ‘ట్రోల్’ గోల్ వేసుకున్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు అన్న విషయం తెలిసిన జగన్ మూడు రాజధానులు అంటూ అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ఐదేళ్లపాటు డ్రామాలు ఎందుకు ఆడారని జగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.

ఏపీ రాజధానిగా అమరావతిని జగన్ ఏనాడు వ్యతిరేకించలేదని సజ్జల రెండు రోజుల క్రితం చెప్పిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుందని, అక్కడ నుంచి పరిపాలన కొనసాగిస్తానని జగన్ ఎందుకు తన పాలనలో లీకులిచ్చారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

2014-19 మధ్యకాలంలో అమరావతి రాజధానికి అసెంబ్లీలో సైతం జగన్ మద్దతిచ్చారని, ఆ విషయం గజినీలా మరిచారని ట్రోల్ చేస్తున్నారు. ఇలా తన రాజకీయ అపరిపక్వతను జగన్ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

This post was last modified on April 1, 2026 2:29 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

54 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago