టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా కండిషన్ ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సినీ నటులు అంటే తప్పుడు దారుల్లో నడిచేవారు.. వాళ్లు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటారు అన్నట్లుగా ఆయన చేసిన కామెంట్ల మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అసలు దేశంలో అత్యధిక అవలక్షణాలు ఉన్నదే రాజకీయ నాయకులకు అన్నది కాదనలేని సత్యం. అవినీతి మొదలుకుని మెజారిటీ రాజకీయ నేతలు చేసే నేరాలు, పాపాల గురించి జనాలకు పూర్తి స్పష్టత ఉంది. అలాంటి రంగంలో ఉంటూ.. సినీ నటుల గురించి అనిరుధ్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
అనిరుధ్ చేసిన వ్యాఖ్యల మీద మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కొంచెం తీవ్రంగానే స్పందించాడు.
అనిరుధ్ రెడ్డి చేసిన సూచన బాగుందంటూ వ్యంగ్యంగా స్పందించిన విష్ణు.. మరి రాజకీయ నాయకులు ఎన్నికల్లో నామినేషన్ సమర్పించే ముందు వాళ్లకు ఎలాంటి టెస్టులు పెట్టాలా అని ఆలోచిస్తున్నట్లు చెప్పాడు.
తమ విషయంలోనూ ఇంతే ఉదారంగా ఆలోచించే ఎమ్మెల్యేతో కలిసి పని చేయడానికి జనాలు కూడా ఎంతో సంతోషిస్తారని మంచు విష్ణు వ్యాఖ్యానించాడు. మరోవైపు కమెడియన్ రాహుల్ రామకృష్ణ సైతం అనిరుధ్ రెడ్డి కామెంట్లపై స్పందించాడు.
‘‘హీరో కాకపోయినా నేను మాత్రం రెడీ!అర్జెంటు గా G.O జారీ చేస్తే అందరం కలిసి చెయ్యిచ్చుకుందాం- మేము డ్రగ్ టెస్టులు మీరు lie డిటెక్టర్ టెస్ట్. ప్రతీ ఆదివారం పెట్టుకుందాం ఈ గొప్ప కార్యక్రమం,అప్పుడే మీ మాట,మా మాట నమ్మి ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు. Minoxidil drug ఎందుకు గుర్తొస్తోందో’’ అంటూ అనిరుధ్ రెడ్డికి కౌంటర్ వేశాడు రాహుల్ రామకృష్ణ.
This post was last modified on April 1, 2026 2:38 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…