Political News

రూపాయి పతనంపై నిర్మలమ్మ మాటలో నిజమెంత?

అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ అంతకంతకూ తగ్గుతోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో రూపాయి జీవన కాలంలోనే అత్యంత కనిష్ఠాలను నమోదు చేస్తూ.. కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. కొద్ది నెలల క్రితం డారల్ తో రూపాయి మారకం విలువ రూ.90 దాటేయటం తెలిసిందే. చూస్తుండగానే రూ.90 కాస్తా రూ.95 దగ్గరకు వచ్చేసింది. కేవలం నెలల వ్యవధిలోనే రూ.5 పతనాన్ని చూస్తున్న పరిస్థితి.

నిజానికి డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.90ను టచ్ చేసినప్పుడు రూ.95 చేరుకోవటానికి.. ఆ తర్వాత రూ.100 దగ్గరకు రావటానికి కనీసం మరో ఐదారేళ్లకు పైనే పడుతుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. అందుకు భిన్నంగా కేవలం కొద్ది నెలల్లోనే రూ.95 చేరుకోవటం ఆందోళనకు గురి చేసేది చెప్పాలి. సోమవారం ట్రేడింగ్ లో ఒక దశలో డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.95.22 స్థాయికి దిగజారి.. రికార్డు స్థాయి పతనాన్ని చవిచూసింది. ఆ తర్వాత పదిహేను పైసల లాభంతో రూ.94.70 వద్ద ముగిసింది.

పశ్చిమాసియా యుద్దంతో రూపాయి దాదాపు 4.1 శాతం నష్టపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా పది శాతం పతనాన్ని నమోదు చేసింది. గడిచిన పద్నాలుగేళ్లలో ఇదే అతి పెద్ద వార్షిక క్షీణతగా చెప్పాలి. యుద్ధం నేపథ్యంలో బ్రెంట్ ముడి చమురు పీపా ధర ఒకదశలో 115 డాలర్లకు పెరగటంతో పాటు డాలర్ బలపడటం.. ఈక్విటీ మార్కెట్ లో నష్టాలు.. ఎఫ్ఐఐల అమ్మకాలు రూపాయి పతనానికి కారణాలుగా చెబుతున్నారు.

ముడి చమురు ధరలు దీర్ఘకాలం పాటు గరిష్ఠ స్థాయిలో కంటిన్యూ అయితే మాత్రం డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.100 టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నమాట వినిపిస్తోంది. వర్ధమాన దేశాల్లో అత్యధికంగా నష్టపోయిన కరెన్సీ మనదే కావటం గమనార్హం. 2011-12 ఆర్థిక సంవత్సరంలో డాలర్ తో రూపాయి మారకం విలువ 12.4 శాతం తగ్గితే.. ఈ ఆర్థిక సంవత్సరంలో 9.88 శాతం తగ్గింది.

డాలర్ తో రూపాయి మారకం విలువపై గణాంకాలు ఇలా చెబుతుంటే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తుండటం గమనార్హం. ఇతర డెవలప్ అవుతునన దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే.. డాలర్ తో రూపాయి బాగుందని ఆమె చెబుతున్నారు. రూపాయి క్షీణతపై లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానం చప్పిన మంత్రి భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెబుతూ..

‘‘మన ఆర్థిక పరిస్థితి పటిష్ఠంగా ఉంది. మన ద్రవ్యలోటు నిర్వహణను ప్రపంచం మొత్తం కొనియాడుతోంది. మన విదేశీ మారక నిల్వలు బలంగా ఉన్నాయి. ఇతర డెవలప్ అవుతున్న దేశాలతో పోలిస్తే రూపాయి పరిస్థితి చాలా బాగుంది’’ అని పేర్కొనటం గమనార్హం

ఇక్కడే ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు (ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం) ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు డాలర్ తో రూపాయి మారకం విలువ 4.1 శాతం తగ్గిందని.. అదే సమయంలో దక్షిణ కొరియా వోన్.. థాయ్ బాట్.. ఫిలిప్పీన్ పెసో లాంటి కరెన్సీలు డాలర్ తో పోలిస్తే రూపాయి కంటే ఎక్కువగా వరుసగా 4.6శాతం, 5.5 శాతం, 4.8 శాతం పడిపోయినట్లుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు.

అయితే.. ఆమె వ్యాఖ్యల్లో ఒక మతలబు ఉంది. గడిచిన నెలలో ఆయా దేశాల కరెన్సీ విలువను మన రూపాయిలో పోల్చి చూశారు. మరి.. అదే గడిచిన ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే.. అసలు విషయం అర్థం కావటమే కాదు.. రూపాయి బక్కచిక్కిని తీరు ఇట్టే అర్థమవుతుంది.

నెల వ్యవధిలో డాలర్ తో మారకం విలువ విషయంలో నిర్మలమ్మ చెప్పింది నిజమే. అయితే.. గడిచిన ఏడాది వ్యవధిలో ఇవే కరెన్సీలను రూపాయితో పోల్చినప్పుడు ఏ కరెన్సీ అత్యధికంగా నష్టపోయింది చూస్తే.. నిర్మలమ్మ వ్యాఖ్యల్లో నిజం నేతిబీరలో నేతి మాదిరి ఉందని చెప్పాలి.

అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ గత ఆర్థిక సంవత్సరంలో 10,75 శాతం నష్టపోతే.. ఫిలిప్పీన్ పెసో 5.61 శాతం.. దక్షిణ కొరియా వోనో 4.39 శాతం తగ్గితే.. అనూహ్య రీతిలో థాయ్ బాట్ 2.73 శాతం డాలర్ కంటే బలపడింది. ఇదంతా చూసినప్పుడు తన వాదనకు అనుకూలమైన గణాంకాల్ని ఆమె ఏడాది కాస్తా.. నెల వ్యవధిలో చూపించి.. చేదునిజాన్ని దాచిపెట్టారని చెప్పక తప్పదు.

This post was last modified on March 31, 2026 9:35 am

Share
Show comments
Published by
Kumar
Tags: Rupee dollar

Recent Posts

జనసేనను వదిలే ప్రసక్తే లేదంటున్న బాలినేని

మాజీ మంత్రి, జ‌న‌సేన నాయ‌కుడు బాలినేని శ్రీనివాస‌రెడ్డి తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన పార్టీలో తాను ఎలాంటి ప‌ద‌వులూ…

1 hour ago

మతిపోయే రేటు చెబుతున్న రామాయణ ?

రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న రామాయణ దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఆ మధ్య వచ్చిన టీజర్ కు మిశ్రమ…

3 hours ago

జ‌గ‌న్‌ను వారెందుకు క‌లిశారు: లోకేష్ ఆరా

మ‌నం ఎంతో పార‌దర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాం. ఎవ‌రికీ ఎలాంటిఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా.. జ‌గ‌న్‌ను కొంద‌రు క‌లుస్తున్నారు. ఇలా ఎందుకు జ‌రుగుతోంది..?…

3 hours ago

జగన్ రైటు… జనమే రాంగా?

ఏపీ రాజ‌ధాని విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌క్కా క్లారిటీతోనే ఉన్నారా? అంటే.. ఔన‌నే ఆయ‌న చెబుతున్నారు. ప్ర‌జ‌లు మెచ్చుతారా..…

4 hours ago

యుద్ధ‌మైనా.. విప‌త్త‌యినా.. మోడీది రాజ‌కీయ‌మే

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. యుద్ధ‌మైనా.. విప‌త్త‌యినా.. ప్ర‌జ‌లకు ఏం…

5 hours ago

జనం మరిచిన హీరో… బిగ్ రిస్క్

ఈ రోజుల్లో ఓ మోస్తరు మార్కెట్ ఉన్న హీరోల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. థియేటర్లకు వచ్చే జనం…

6 hours ago