తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇలా, తెలంగాణ ఆత్మగౌరవం అంటూ కేటీఆర్….సంస్కారం అంటూ బండి సంజయ్ ల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. ఈ నేతల మాటల తూటాలతో తెలంగాణ రాజకీయ వాతావరణ ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణలో జాతీయ స్థాయి నేతల వరుస పర్యటనలతో రాజకీయాలు హీటెక్కాయి.
కాంగ్రెస్, బీజేపీ నేతల్లో పదవులకు హుందాతనం లేదని కేటీఆర్ విమర్శించారు. గాంధీ కుటుంబానికి చెందిన నేతలకు బాడీగార్డుల మాదిరి సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన చురకలంటించారు. ఇక, రాహుల్ బైక్ వెంట కాంగ్రెస్ మంత్రులు, పీసీపీ చీఫ్ పనివారిలా పరుగులు పెడుతున్నారని ఎద్దేవా చేయడం అవమానకరమని విమర్శించారు. అమిత్ షా కాళ్లు మొక్కి చెప్పులు మోసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగణకే సిగ్గు చేటని, ఇటువంటి అసందర్భ ప్రవర్తనతో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని వారు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఆత్మ గౌరవ నినాదంతో తెలంగాణ ఏర్పడిందని, కానీ బీజేపీ నేతల తీరు అత్యంత సిగ్గుచేటు అని విమర్శించారు.
ఈ క్రమంలోనే కేటీఆర్ కు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. పెద్దలకు మర్యాద చేసే సంస్కారం కొందరికి లేదని కేటీఆర్ కు బండి సంజయ్ చురకలంటించారు. పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని విమర్శించారు. గురువుకు కాళ్లు మొక్కుతానని, చెప్పులందిస్తానని, అది తన సంస్కారం అని చెప్పారు. తాము బీఆర్ఎస్ నేతల్లా చెప్పులు ఎత్తుకుపోయే బ్యాచ్ కాదని, కాళ్లు మొక్కే క్రమంలో కాళ్లు గుంజమని కేటీఆర్ కు చురకలంటించారు.
కాళేశ్వరం పేరుతో పైసలు దోచేసింది, ఆఖరికి సిగ్గు లేకుండా భార్యాభర్తల ఫోన్ కాల్స్ ట్యాప్ చేసి వినేస్థాయికి దిగజారిన వారు కూడా డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారని కేటీఆర్ కు చురకలంటించారు. అటువంటి నేతలు పదవుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని విమర్శించారు.
ఇక, సిరిసిల్లలో పర్యటించిన సందర్భంగా కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలతో కేటీఆర్ కు గుబులు పట్టుకుందని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 19న సిద్ధిపేటలో రేవంత్ పర్యటించబోతున్నారని, అందుకే హరీష్ రావు గుండెల్లో గుబులు మొదలైందని విమర్శించారు. రేవంత్ పర్యటన తర్వాత హరీశ్ నిజ స్వరూపం సిద్దిపేట ప్రజలు తెలుసుకుంటారని ఆది శ్రీనివాస్ అన్నారు.
This post was last modified on November 16, 2026 2:38 pm
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడానికి పెద్దగా కారణాలు అవసరం లేదు. కొన్నిసార్లు సెలబ్రిటీలకు కూడా సాధ్యం కాని…
టాలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకులకు లోటు లేదు. కానీ దాన్ని పరిపూర్ణంగా, క్రమం తప్పకుండా వాడుకునేవాళ్ళు ఎంతమంది అంటే సమాధానం…
ఈ వారం విడుదల కాబోతున్న వాటిలో ఎక్కువ ప్రామిసింగ్ గా కనిపిస్తున్న సినిమా ఆకాశంలో ఒక తార. స్వప్న సినిమా,…
ఒకప్పుడు తెలుగులో స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా తమిళ డబ్బింగులు ఆడేవి. వీటి ప్రభావం ఎంతగా ఉండేదంటే దెబ్బకు మన నిర్మాతలు…
కరోనా వచ్చి వెళ్ళిపోయిన ఒకటి రెండు సంవత్సరాలు ఓటిటిలో వచ్చే కంటెంట్, కొత్త సినిమాల గురించి సోషల్ మీడియాలో డిబేట్లు…
భారతీయ రైల్వేలో ఆధునిక ప్రయాణానికి గుర్తింపుగా నిలుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్కు సంబంధించిన ఓ ఘటన ఇప్పుడు భద్రతా వ్యవస్థపై…