అసెంబ్లీ టికెట్ కోసం సీఎంతో ఇంటర్వ్యూ

ఔను!. నిజ‌మే.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టికెట్ కావాలంటే ముందుగా ఇంట‌ర్వ్యూకు హాజ‌రుకావాలి. ఈ ఇంటర్వ్యూలో పాల్గొనాలంటే.. ఎంట్ర‌న్స్ ఫీజును చెల్లించాలి. ఈ ఫీజు నాన్ రిఫండ‌బుల్‌. ఒక వేళ ఇంట‌ర్వ్యూలో విఫ‌ల‌మై.. సీటు రాక‌పోతే దీనిని యాగీ చేయ‌డానికి, న్యాయ‌ప‌ర‌మైన పోరాటం చేయ‌డానికి కూడా వీల్లేదు. అంతేకాదు.. ఇంట‌ర్వ్యూకు వ‌చ్చేవారు.. త‌మ సొంత ఖ‌ర్చుల‌తో రావాలి.. సొంత బ‌స ఏర్పాటు చేసుకోవాలి. ఎన్ని రోజులైనా వేచి ఉండాలి. ఇంట‌ర్వ్యూ అయ్యాక‌.. సెల‌క్ట్ అయితే.. అభ్య‌ర్థికి కాల్ లెట‌ర్ పంపిస్తారు.

ఇదంతా చిత్రంగా ఉంది క‌దా!. కానీ.. ప‌క్కా నిజం!!. త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే అనుస‌రిస్తున్న విధానం ఇదే. ప్ర‌స్తుతం 240 స్థానాలు ఉన్న అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ వ‌చ్చే నెల 23న జ‌ర‌గ‌నుంది. సిట్టింగులు స‌హా.. ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి అనేక మంది నాయ‌కులు పోటీకి ఎగ‌బ‌డుతున్నారు. దీనికితోడు పార్టీల‌తో సంబంధం లేని యువ‌త‌, విద్యావంతులు కూడా డీఎంకే త‌ర‌ఫున పోటీ చేయాల‌ని త‌ల‌పోస్తున్నారు. దీనిని గ‌మ‌నించిన డీఎంకే అధినేత‌, సీఎం స్టాలిన్ `ఇంట‌ర్వ్యూ` నిబంధ‌న‌ను అమ‌లు చేస్తున్నారు.

సీటు కావాల‌నుకునే సిట్టింగులు.. స‌హా ఇత‌ర అభ్య‌ర్థులు ఎంత మందైనా.. ఇంట‌ర్వ్యూకు హాజ‌రు కావొచ్చు. దీనికి ముందు పార్టీకి రుసుము చెల్లించి.. ద‌ర‌ఖాస్తు కొనుగోలు చేయాలి. ఇదే `ఎంట్ర‌న్స్ ఫీజు.` ఈ ఫీజును జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక్కొక్క అభ్య‌ర్థికీ 25000 రూపాయ‌లు, ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు 15000 చొప్పున నిర్ణ‌యించారు. ఇది చెల్లించి.. ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తును పొంద‌వ‌చ్చు. దీనిలో వివ‌రాలు నింపిన త‌ర్వాత‌.. ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్‌లో వ‌చ్చి.. నేరుగా సీఎం స్టాలిన్‌(ఈ స‌మ‌యంలో పార్టీ అధినేత‌) ముందు కూర్చోవ‌చ్చు.

స‌ద‌రు అభ్య‌ర్థుల‌ను స్టాలిన్, పలు పార్టీ సీనియర్ నేతలు ఇంట‌ర్వ్యూ చేస్తారు. అభ్య‌ర్థి సామాజిక వ‌ర్గం, రాజ‌కీయాల‌పై ఉత్సాహం, ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న ఆలోచ‌న‌.. స‌హా.. ఆర్థిక ప‌రిస్థితిని, కుటుంబ నేప‌థ్యాన్ని కూడా తెలుసుకుంటారు. అభిరుచులు కూడా తెలుసుకుంటారు. దీంతో ఇంట‌ర్వ్యూ అయిపోతుంది. గ‌రిష్టంగా ఒక్కొక్క అభ్య‌ర్థికి 5 నిమిషాల చొప్పున కేటాయించి ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తున్నారు. ఇలా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వారం ప‌ది రోజుల్లో వేల మంది వ‌చ్చారంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. కానీ.. నిజం.!.ఈ ద‌ర‌ఖాస్తుల ద్వారా కోట్ల రూపాయ‌లు పార్టీకి స‌మ‌కూరుతున్నాయి.

ఎందుకిలా?

దీనిపై డీఎంకే వివ‌ర‌ణ ఇచ్చింది. మంచి నాయ‌కుల‌ను ఎంపిక చేయాల‌న్న‌ది స్టాలిన్ ల‌క్ష్య‌మ‌ని పేర్కొంది. అదేవిధంగా అంద‌రికీ అవ‌కాశం క‌ల్పించాల‌న్న‌ది కూడా ఆయ‌న అభిమ‌తంగా తెలిపింది. గ‌తంలో క‌రుణానిధి ఇలానే ఇంట‌ర్వ్యూలు చేసేవార‌ని.. ఇప్పుడు కొన‌సాగిస్తున్నార‌ని పేర్కొంది. అయితే.. ఎంట్ర‌న్స్ ఫీజుల పేరుతో డ‌బ్బులు ఎందుకు వ‌స్తూలు చేస్తున్నారంటే.. ఆర్థికంగా కొంత వ‌ర‌కైనా బ‌లంగా ఉన్న‌వారిని ఎంపిక చేయ‌డానికి ఇది తొలి మెట్ట‌ని చెబుతున్నారు. ఇక్క‌డే చాలా మంది ఫిల్ట‌ర్ అవుతార‌ని పేర్కొన్నారు. కాగా.. దీనిపై విమ‌ర్శ‌లతో పాటు ప్ర‌శంస‌లు కూడా వ‌స్తున్నాయి.