Movie News

‘మిస్టర్ బచ్చన్’ పోయింది కదాని పవన్‌తో అంటే..

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ కెరీర్లో మెమొరబుల్ హిట్స్‌లో ‘గబ్బర్ సింగ్’ ఒకటి. ఆ సినిమాతో అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ పంచిన ఆనందం అంతా ఇంతా కాదు. ఐతే అంత పెద్ద సక్సెస్ కొట్టాక మళ్లీ అదే హీరోతో సినిమా చేయడానికి పుష్కరం పైగానే పట్టింది. ఐతే ఈసారి పవన్‌తో హరీష్ శంకర్ సినిమా చేస్తుంటే.. అభిమానుల్లో అంత ఎగ్జైట్మెంట్ కనిపించలేదు.

ఇది రీమేక్ అన్న ప్రచారానికి తోడు సినిమా బాగా ఆలస్యం కావడం ఒక ముఖ్య కారణం. దీనికి తోడు హరీష్ శంకర్ ఫామ్‌లో లేకపోవడం కూడా అభిమానులను టెన్షన్ పెట్టింది. హరీష్ చివరి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. ఐతే హరీష్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడ్డారు కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం అలాంటి ఫీలింగ్ ఏమీ పెట్టుకోలేదట. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడాడు.

‘మిస్టర్ బచ్చన్’ నిరాశపరిచిన నేపథ్యంలో ఆ విషయాన్ని పవన్ దగ్గర ప్రస్తావించి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకొంచెం జాగ్రత్తగా చేద్దాం అంటూ తాను మాట్లాడితే.. పవన్ స్పందన తనను ఆశ్చర్యపరిచిందని హరీష్ వెల్లడించాడు.

‘‘నా చివరి సినిమా సరిగా ఆడలేదు కదా’’ అని అంటే.. ‘‘ఐతే ఏంటి? కష్టపడి సినిమాలు చేస్తాం. హిట్టా ఫ్లాపా అన్నది మన చేతుల్లో ఉండదు. నువ్వు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నావు. ఎంత తపన పడుతున్నావు అన్నది ముఖ్యం. ఈ సినిమా కోసం నువ్వెంత ఎఫర్ట్ పెడుతున్నావో తెలుసు. అయిపోయిన సినిమా గురించి బాధపడకు. ఈ సినిమా మీద దృష్టిపెట్టు. దీని కోసం ఏం కావాలో అది నేను చేస్తా’’ అంటూ పవన్ తనకు భరోసా ఇచ్చాడని హరీష్ వెల్లడించాడు.

ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విశేషాల గురించి హరీష్ మాట్లాడుతూ.. ‘గబ్బర్ సింగ్’లో ఎలా అయితే ఫ్యాన్ మూమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్, రొమాంటిక్ ట్రాక్, కామెడీ ఇలా ప్రతిదీ ఉన్నాయో.. ఈ చిత్రం కూడా ఒక విందుభోజనంలా ఉంటుందని.. ఇప్పుడు తెలుగు సినిమా పరిధి ఇంకా పెరిగిన నేపథ్యంలో కేవలం అభిమానులనే కాక అందరినీ మెప్పించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశామని.. కుటుంబంలో అందరికీ ఈ సినిమా నచ్చుతుందని హరీష్ ధీమా వ్యక్తం చేశాడు.

This post was last modified on March 7, 2026 3:06 pm

Share

Recent Posts

బుచ్చిబాబు మిస్సయ్యింది శ్రీకాంత్ చేజారకూడదు

సరిగ్గా మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల క్రితం పెద్ది రిలీజయ్యింది. ఒకే సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబుని నమ్మి…

2 hours ago

కర్ణుడిగా లారెన్స్… రిస్క్ అవుతుందా

డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, దర్శకుడు కం హీరోగా మారి, హారర్ కామెడీ అనే కొత్త జానర్ సృష్టించి,…

2 hours ago

హీరోయిన్ రాధను సొంత అక్కే 46 కోట్లు మోసం చేసిందా?

ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా…

3 hours ago

దిల్ రాజు ద‌గ్గ‌ర ఆ డ‌బ్బులు తీసుకోని ప‌వ‌న్‌

సామాన్య జ‌నాల్లోనే కాదు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్లోనూ పెద్ద సంఖ్య‌లో వీరాభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాము…

7 hours ago

క్లారిటీ ఇవ్వాలంటోన్న సేన‌.. వెయిట్ అంటోన్న సేనాని..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓట‌ర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..…

7 hours ago

ఔరా అవినాష్‌… పోలీసుల‌తో చెల‌గాట‌మా?!

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత‌, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ పోలీసుల‌తో…

7 hours ago