Political News

అందుకే నాకు కన్నీళ్లు ఆగలేదు: చంద్రబాబు

గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుకు తాను కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. ఆ సమయంలో తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పారు.

“2019-24 మధ్య నాలాగే చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. విశాఖకు వెళ్తే పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్నారు. గతంలో ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారు” అని వైసీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సభలో ప్రసంగించారు. ఈ సమయంలో వైసీపీ హయాంలో జరిగిన అనేక పరిణామాలను ఆయన వివరించారు. ప్రజలు ప్రతి అంశాన్నీ గమనిస్తూనే ఉంటారని తెలిపారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై అధికారంలోకి వచ్చిన వెంటనే 7 శ్వేతపత్రాలను విడుదల చేశామని పేర్కొన్నారు.

వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు సీఎం తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు.

పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఆనాడు వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టి పేదల పొట్ట కొట్టిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే 213 క్యాంటీన్లను ఏర్పాటు చేశామని వివరించారు. వచ్చే మూడు నెలల్లో అన్నా క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

పీపీపీ వల్ల సంపద సృష్టి జరుగుతోందని ఆయన అన్నారు. ఈ విషయం తెలియని వారే పీపీపీని వ్యతిరేకిస్తున్నారని, వారికి కావాల్సింది అభివృద్ధి కాదని, విధ్వంసమని పేర్కొన్నారు. ఎవరు ఏం చేసినా, ఎలాంటి విమర్శలు చేసినా రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు పీపీపీ విధానంలోనే నిర్మిస్తామని సీఎం తేల్చిచెప్పారు. పీ4 ద్వారా భవిష్యత్‌లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పేదరిక నిర్మూలనకు సంబంధించి దేశంలోనే ఇది అత్యుత్తమ మోడల్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

This post was last modified on February 13, 2026 3:57 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

50 minutes ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

3 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

4 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

4 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

5 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

5 hours ago