Political News

అంబటిపై 36 కేసులు.. ఇప్పట్లో బయటకు రాలేరా?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. తిరుమల మహా ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ నివేదిక నేపథ్యంలో రాజకీయ పక్షాల మధ్య జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలం వాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేశారు. ఇదే అంశంపై రాంబాబుపై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయని వైసీపీ ఆరోపిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ కేసులు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో అంబటి రాంబాబు అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ వచ్చినా మిగతా కేసుల్లో అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.

ఇటీవల కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. సిట్ నివేదిక తర్వాత జంతువుల కొవ్వు కలిసిందని గతంలో చేసిన వ్యాఖ్యలను వైసీపీ ప్రస్తావించగా, టీడీపీ జగన్, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.

వాటిని తొలగించేందుకు వెళ్లిన అంబటి రాంబాబును టీడీపీ శ్రేణులు అడ్డుకున్న ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆ సమయంలో సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పలుచోట్ల ఫిర్యాదులు నమోదయ్యాయి.

అంబటి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఆ ఘటనను వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. మరోవైపు, చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ శాఖ చెబుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

This post was last modified on February 8, 2026 3:36 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

7 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

9 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

10 hours ago