ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాంతంలో రాజధాని కట్టాలనుకుంది. అందుకోసం చట్టం కూడా చేసింది. రాజధాని కోసం రైతుల్ని భూములడిగింది. వాళ్లు ఔనన్నా, కాదన్నా ఏం చేసైనా భూములు తీసుకోవడం ఖాయం. ఐతే ప్రభుత్వం లాభదాయ ప్యాకేజీ అనేసరికి మెజారిటీ రైతులు సరే అన్నారు. ఇష్టం లేని రైతులు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో భూములు ఇచ్చారు. ఒప్పందాలు జరిగాయి. కానీ తర్వాతి ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోయింది.
ఇంతకుముందు ఆ ప్రాంతంలో రాజధాని తమకు పూర్తి ఆమోద యోగ్యం అన్న ఆ పార్టీనే అధికారంలోకి వచ్చాక మాట మార్చేసింది. రాజధానిని తరలించడానికి సిద్ధమైపోయింది. దీనికి వ్యతిరేకంగా ఆ రైతులు పోరాడుతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై నిలదీస్తున్నారు. ఇదీ అమరావతి రైతుల దీన గాథ.
రాజకీయ క్రీడలో బలిపశువులైన ఆ రైతులు.. ఏడాదిగా పోరాడుతుంటే ప్రభుత్వం నుంచి వారి బాధను ఆలకించే నాథుడే లేడు. పైగా వారిని పెయిడ్ ఆర్టిస్టులని, దురాశాపరులని నానా మాటలన్నారు. తమ పోరాటానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో మరింత పెద్ద స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లాలని ఆ రైతులు చూస్తుంటే.. వారి గురించి మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు మరీ అన్యాయంగా అనిపిస్తున్నాయి. వ్యవసాయం వదులుకుని భూముల ధరలు పెరగాలని కోరుకునేవాళ్లు రైతులు కాదని ఆయన విమర్శించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎక్కడైనా రైతు సాగుకోసం పరితపిస్తాడని.. వీళ్లు మాత్రం తమకు భూములొద్దు ప్లాట్లు కావాలంటున్నారని ఆక్షేపించారు. ప్లాట్ల విలువ పెరగాలని కోరుకునేవారు రైతులెలా అవుతారని నాని ప్రశ్నించారు.
రాజధాని ప్రాంతంలో నిరుపేద రైతులు, బలహీనవర్గాలకు సెంటు స్థలం ఇస్తామని ప్రభుత్వం ముందుకొస్తే కోర్టుకెళ్లి అడ్డుకున్నారని ఆరోపించారు. తమ పొలాలు తీసుకున్న ప్రభుత్వం అక్కడ అనేక నిర్మాణాలు చేపట్టి, రోడ్లేసి పొలాల రూపాల్నే మార్చేస్తే.. తమ పొలాలెక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంటే.. మంత్రి చెబుతున్నట్లు రైతులు వ్యవసాయం ఎలా చేయాలి? తాము ప్రభుత్వానికి ఇచ్చిన పొలంలో నాలుగో వంతు మాత్రమే వెనక్కి ఇచ్చినపుడు అవి అభివృద్ధి చెందాలని, వాటి రేటు పెరగాలని ఆశించడంలో ఏం తప్పుంది? తమ సంగతి తేల్చకుండా తమ స్థలాల్ని పేదలకి రాసిస్తామంటే వారెలా ఒప్పుకుంటారు? ఈ ప్రశ్నలకు నాని ఏం సమాధానాలు చెబుతారో మరి?
This post was last modified on December 18, 2020 10:04 am
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…