ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం రేపిన రాజకీయ దుమారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ తమకు అనుకూలంగా ఉంది అంటే తమకు అనుకూలం అంటూ వైసీపీ, టీడీపీ నేతలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు.
గతంలోనూ ఇప్పుడు కూడా అనేకసార్లు తిరుమల వెంకన్న తమ కులదైవం అని సీఎం చంద్రబాబు ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే, చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ లాజిక్ మిస్సయిన వైనంపై ట్రోలింగ్ జరుగుతోంది.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు..కౌంటర్లు సహజం. అయితే, కనీస లాజిక్ లేకుండా ఇచ్చే కౌంటర్లు నవ్వుల పాలవుతుంటాయి. గోరంట్ల మాధవ్ చేసిన కామెంట్లు ఆ కోవలోకే వస్తాయి.
వెంకటేశ్వర స్వామి మీద వైఎస్ కుటుంబానికి భక్తి ఎక్కువని, కాబట్టే జగన్ ముత్తాత పేరు వెంకట్ రెడ్డి అని పెట్టుకున్నారని గోరంట్ల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటేనే దేశంలో ఎవరైనా వెంకటేశ్వరుని పేరు పెట్టుకుంటారని అన్నారు.
తమ కులదైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పుకునే చంద్రబాబు కుటుంబంలో ఒక్కరికి కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పేరు పెట్టలేదని విమర్శించే క్రమంలో గోరంట్ల ఈ కామెంట్లు చేశారు. వెంకటేశ్వర స్వామి తనకు మాత్రమే దైవమని, తన కుటుంబానికే కులదైవమనే భావనలో చంద్రబాబు ఉన్నారని గోరంట్ల విమర్శించారు.
చంద్రబాబు తండ్రి పేరు ఖర్జూర నాయుడని, చంద్రబాబు తనయుడి పేరు లోకేశ్ అని…ఆయన ఇంట్లో ఎవరికీ వెంకటేశ్వర్లు అనే పేరు ఎందుకు పెట్టలేదని గోరంట్ల ప్రశ్నించారు.
అయితే, జాతకం, పుట్టిన తేదీ, తిథి, నక్షత్రం, వారం ప్రకారం వేద పండితులు లేదా పూజారులు ఒక అక్షరం సూచిస్తారని, దానిని బట్టి పిల్లలకు తల్లిదండ్రులు పేరు పెడతారని, ఈ విషయం గోరంట్లకు తెలియకపోవడం బాధాకరమని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
చంద్రబాబు కుటుంబానికి కుల దైవం వెంకటేశ్వర స్వామి కావడానికి, కుటుంబంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పేర్లు పెట్టకపోవడానికి సంబంధం లేదని అంటున్నారు. ఆ మాటకొస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మతం మారారని, ఆ తర్వాత ఆ కుటుంబంలో ఎవరూ హిందూ ధర్మాన్ని ఫాలో కావడం లేదని గుర్తు చేస్తున్నారు.
This post was last modified on February 7, 2026 4:56 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…