ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం రేపిన రాజకీయ దుమారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ తమకు అనుకూలంగా ఉంది అంటే తమకు అనుకూలం అంటూ వైసీపీ, టీడీపీ నేతలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమల వెంకన్న తమ కులదైవం అని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే, చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ లాజిక్ మిస్సయిన వైనంపై ట్రోలింగ్ జరుగుతోంది.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు..కౌంటర్లు సహజం. అయితే, కనీస లాజిక్ లేకుండా ఇచ్చే కౌంటర్లు నవ్వులపాలవుతుంటాయి. గోరంట్ల మాధవ్ చేసిన కామెంట్లు ఆ కోవలోకే వస్తాయి. వెంకటేశ్వర స్వామి మీద వైఎస్ కుటుంబానికి భక్తి ఎక్కువని, కాబట్టే జగన్ ముత్తాత పేరు వెంకట్ రెడ్డి అని పెట్టుకున్నారని గోరంట్ల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటేనే దేశంలో ఎవరైనా వెంకటేశ్వరుని పేరు పెట్టుకుంటారని అన్నారు.
తమ కులదైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పుకునే చంద్రబాబు కుటుంబంలో ఒక్కరికి కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పేరు పెట్టలేదని విమర్శించే క్రమంలో గోరంట్ల ఈ కామెంట్లు చేశారు. వెంకటేశ్వర స్వామి తనకు మాత్రమే దైవమని, తన కుటుంబానికే కులదైవమనే భావనలో చంద్రబాబు ఉన్నారని గోరంట్ల విమర్శించారు. చంద్రబాబు తండ్రి పేరు ఖర్జూర నాయుడని, చంద్రబాబు తనయుడి పేరు లోకేశ్ అని…ఆయన ఇంట్లో ఎవరికీ వెంకటేశ్వర్లు అనే పేరు ఎందుకు పెట్టలేదని గోరంట్ల ప్రశ్నించారు.
అయితే, జాతకం, పుట్టిన తేదీ, తిథి, నక్షత్రం, వారం ప్రకారం వేద పండితులు లేదా పూజారులు ఒక అక్షరం సూచిస్తారని, దానిని బట్టి పిల్లలకు తల్లిదండ్రులు పేరు పెడతారని, ఈ విషయం గోరంట్లకు తెలియకపోవడం బాధాకరమని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు కుటుంబానికి కుల దైవం వెంకటేశ్వర స్వామి కావడానికి, కుటుంబంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పేర్లు పెట్టకపోవడానికి సంబంధం లేదని అంటున్నారు. ఆ మాటకొస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మతం మారారని, ఆ తర్వాత ఆ కుటుంబంలో ఎవరూ హిందూ ధర్మాన్ని ఫాలో కావడం లేదని గుర్తు చేస్తున్నారు.
This post was last modified on February 7, 2026 5:04 pm
ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం రేపిన రాజకీయ దుమారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ తమకు…
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ…
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…