అవును మీరు చదివింది నిజమే. నూతన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో ఎంత ఉద్యమం జరుగుతోందో అందరు చూస్తున్నదే. ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘూ దగ్గర గడచిన 22 రోజులుగా రైతులు పట్టినపట్టు విడవకుండా కేంద్రప్రభుత్వానికి చెమటలు పట్టించేస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో పంజాబ్ లో రైతు సంఘాల ఆధ్వర్యంలో మొదలైన ఆందోళన చివరకు ఉద్యమస్ధాయికి చేరుకున్నది.
మొదట్లో పంజాబ్ లోని రైతులు మాత్రమే స్పందించినా తాజాగా హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని రైతన్నలు కూడా జాయినవుతున్నారు. తొందరలోనే అన్నదాతల ఉద్యమం దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు కూడా పాకుతోంది. వివిధ రాష్ట్రాల్లోని రైతుసంఘాలకు ప్రతిపక్షాలు తోడవుతున్నాయి. ఇందుకే మొన్నటి భారత్ బంద్ కూడా సక్సెస్ అయ్యింది. మొదట్లో ఉద్యమాన్ని చాలా తేలిగ్గా తీసుకున్న కేంద్రానకి ఇపుడు ఉద్యమ సెగ బాగా తగులుతోంది.
దానికితోడు ఇప్పటికి నాలుగుసార్లు రైతులు-కేంద్రమంత్రులకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతులు, ఎట్టి పరిస్ధతుల్లోను కుదరదంటూ కేంద్రం ఎవరి పట్టుదలతో వాళ్ళున్నారు. దాంతో కేంద్రానికి ఇబ్బందిగా తయారైంది. అందుకనే నష్ట నివారణకు దిగింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాస్త్రజ్ఞులు, నిపుణులతో చర్చలు మొదలుపెట్టింది. వ్యవసాయ చట్టాలు చేయటానికి ముందు చేయాల్సిన పనిని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పద్దతిలో ఇపుడు చేస్తోంది.
తెలంగాణా సీఎం కేసీయార్, ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డితో హడావుడిగా చర్చలు జరిపింది. తెలుగురాష్ట్రాల్లో రైతు ఉద్యమ ప్రభావం తెలుసుకోవటం, ఉద్యమానికి ప్రభుత్వం తరపున మద్దతు దక్కకుండా చేయటమనే వ్యూహంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను ప్రధానమంత్రి నరేంద్రమోడి రంగంలోకి దింపారు. రెండు రోజుల తర్వాత ఇదే విషయమై ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కూడా అమిత్ భేటీ అవ్వబోతున్నారు. తర్వాత తమిళనాడు సీఎం పళనిస్వామిని కూడా పిలవబోతున్నట్లు సమాచారం.
అంటే ఇక్కడ మూడు వ్యూహాలతో కేంద్రం ముందుకెళుతోంది. ఎలాగూ బీజేపీ పాలిత రాష్ట్రాలను ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు. ఇక రెండోది అవసరానికి వెలుపల నుండి మద్దతిస్తున్న ముఖ్యమంత్రులు అంటే కేసీయార్, జగన్, నవీన్ లాంటి వాళ్ళతో చర్చలు జరపటం. మూడోది కేంద్రాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాంటి వాళ్ళని వదిలేయటం. ఇపుడు చేస్తున్న కసరత్తేదో నూతన వ్యవసాయ చట్టాలను చేసేముందే అందరితోను మాట్లాడుంటే ఇపుడీ గొడవలు ఉండేవే కాదు. అందుకనే మోడి సర్కార్ రివర్సులో నడుస్తోందనిపిస్తోంది.
This post was last modified on December 17, 2020 2:31 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…