ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చేయడం వంటి చర్యలు ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇదేం పద్ధతి? అంటూ హైకోర్టు పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. నిందితులను నడిరోడ్డుపై నడిపించడం అంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంది.
ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత? ఎవరు ప్రోత్సహించారు? దీనికి సంబంధించి రూల్స్ ఏమి చెబుతున్నాయి? అనే వివరాలతో డీజీపీ నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. నిందితులను అవహేళనగా మాట్లాడడం కూడా నేరంగానే పరిగణించబడుతుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని గుర్తు చేసింది. ఈ మేరకు సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ అండ్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్ విజయవాడ జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్ కుమార్ దాఖలు చేసిన పిల్‌పై బుధవారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా పలు ఆధారాలను పిటిషనర్ కోర్టు ముందు ఉంచారు. డీజీపీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. దీనిపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. నిందితులను వాహనాల్లో ఎక్కించి తీసుకెళ్లాల్సిందేనని, ఇతర కారణాలు చెప్పడానికి వీల్లేదని వ్యాఖ్యానించినట్లు పిటిషనర్ తరఫున న్యాయవాది తెలిపారు. ఏదైనా కేసు నమోదైన వెంటనే నిందితుల ఆత్మాభిమానం దెబ్బతినేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని తెలిపారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి కూడా ఏకీభవించారని చెప్పారు.
ప్రభుత్వం మెప్పు పొందేందుకు నిందితుల ప్రాథమిక హక్కులను కాలరాస్తారా? అని పోలీసు ఉన్నతాధికారులను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఆయా ఘటనలు జరిగిన జిల్లాల ఎస్పీలు తమకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా తెనాలి, గుంటూరు, ప్రకాశం, ఏలూరు జిల్లాల్లో పోలీసులు నిందితులను వివిధ కారణాలతో నడిరోడ్డుపై నడిపించారు.
This post was last modified on February 4, 2026 4:48 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…