జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ అంశంపై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు గుర్తొస్తారు.. అధికారం పోగానే కాపులు గుర్తుకొస్తారని ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం వేగంగా కొనసాగుతుండటాన్ని తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ అభద్రతాభావంతో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నంతకాలం తన తండ్రి ముద్రగడ పద్మనాభాన్ని జగన్ గుర్తించలేదని, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కాపు అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని క్రాంతి విమర్శించారు. అంబటి రాంబాబు అంశాన్ని ముందుకు తెచ్చి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇదే తరహాలో రేపు తన తండ్రిని కూడా బలిపశువుగా మార్చరనే గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు.
తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొన్నా, అసలేమీ జరగనట్టు వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యంగా ఉందన్నారు. సుమారు 60 లక్షల కిలోల నెయ్యి హానికర రసాయనాలతో తయారైనట్టు ఛార్జ్‌షీట్‌లో ఉందని, దీనిని దారి మళ్లించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
This post was last modified on February 4, 2026 10:41 am
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…
సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…
ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియన్ ఫిలిం మేకర్స్ ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత…
మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని అనుకునేవారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…