Political News

అంబ‌టికి జైలు… బాబును పెట్టిన చోటే!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ ఖైదు విధిస్తూ.. గుంటూరు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆదివారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న‌ను రాజ‌మండ్రిలోని సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. అయితే.. చిత్రం ఏంటంటే.. గ‌తంలో వైసీపీ హ‌యాంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఎక్క‌డైతే ఉంచారో.. అక్క‌డే ఇప్పుడు అంబ‌టి కూడా ఉండ‌నున్నారు.

ఈయ‌నే కాదు.. గ‌తంలో అక్ర‌మ మ‌ద్యం కేసులో అరెస్ట‌యిన ప్ర‌స్తుత రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని కూడా.. ఆ జైలులోనే 83 రోజుల‌పాటు ఉంచిన విష‌యం తెలిసిందే. ఇదంతా యాదృచ్ఛిక‌మే అయినా.. చేసిన పాపం ఎక్క‌డికి పోతుంద‌ని టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్ర‌బాబును జైల్లో పెట్టి ఆనందించిన నాయ‌కుల‌కు అదే చోట జైలు ప‌డుతుండ‌డంపై వారు ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఇక‌, అంబ‌టి రాంబాబు చెప్పిన‌ట్టుగానే.. బెయిల్ కోర‌లేదు. వాస్త‌వానికి ఆయ‌న బెయిల్ పిటిష‌న్ వేసుకుని ఉంటే.. మ‌రోలా జ‌రిగి ఉండేద‌ని అంటున్నారు. ఇదిలావుంటే.. తొలుత న్యాయాధికారి.. ఆయ‌న‌ను గుంటూరు జైలుకే సిఫారసు చేశారు.

కానీ, రాంబాబే.. ప‌ట్టుబ‌ట్టి త‌న‌ను రాజ‌మండ్రి జైలుకు పంపించాల‌ని కోరిన‌ట్టు తెలిసింది. ఇక‌, విచార‌ణ‌లోనూ రాంబాబు పెద్ద‌గా ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేయ‌లేదు. సీఎం చంద్ర‌బాబుపై దూష‌ణ‌ల‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఉద్దేశ‌పూర్వ‌కంగా వైసీపీ నాయ‌కుల‌ను టీడీపీ టార్గెట్ చేస్తోంద‌ని.. దీంతో త‌మ ప‌రిస్థితి  ఇబ్బందిగా మారింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఏదేమైనా.. చేసుకున్న వారికి చేసుకున్నంత‌.. అన్న‌ట్టుగా నోటి దురుసు మంచిది కాద‌ని.. గ‌త అనుభ‌వాలు వైసీపీకి గుణపాఠంగా మారినా.. నాయ‌కులు మార‌డం లేదు. మ‌రోవైపు మాజీ మంత్రి జోగి ర‌మేష్‌ను కూడా అరెస్టు చేయ‌నున్న‌ట్టు తెలిసింది. ఆయ‌న‌పై తాజాగా రాష్ట్రంలో మ‌రో నాలుగు కేసులు న‌మోద‌య్యాయి. 

This post was last modified on February 2, 2026 3:47 pm

Share

Recent Posts

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

23 minutes ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

30 minutes ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

47 minutes ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

52 minutes ago

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

2 hours ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

3 hours ago