ప్రతి ఏటా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోయే కొన్ని ఘడియల ముందు దేశ రాష్ట్రపతి ఆమెకు చక్కెర కలిపిన పెరుగు (దహి – చక్కర్) తినిపించడం ఆనవాయితీ. అయితే దీని వెనుక కారణం ఏంటని చాలామందికి సందేశం కలగక మానదు.
ఇది మన భారతదేశ సాంప్రదాయాల్లో ఒకటి. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు హిందూ సాంప్రదాయం ప్రకారం చక్కెర కలిపిన పెరుగును తినిపిస్తారు. ఇలా చేస్తే ఆ పని విజయవంతమవుతుందని ఒక నమ్మకం.
బడ్జెట్ ఒక కీలక కార్యక్రమం. దానిపైన దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. అటువంటి అతిపెద్ద కార్యక్రమం సవ్యంగా జరగాలని స్వయంగా దేశ ప్రథమ పౌరులు, గౌరవ రాష్ట్రపతి గారు తినిపిస్తారు. ఇది కొన్ని దశాబ్దాలుగా నెహ్రూ కాలం నుండి వస్తున్న ఆనవాయితి.
మరి అందరూ ఎదురుచూస్తున్న ఈ సంవత్సరపు ఆర్థిక బడ్జెట్ దేశ ప్రజలకు.. రాష్ట్ర ప్రభుత్వాలకు తీపిగా ఉంటుందో లేదో వేచి చూడాలి.
This post was last modified on February 2, 2026 8:49 am
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…