ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును అంబటి బూతులు తిట్టిన వైనంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే అంబటిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గుంటూరు పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఆ గొడవపై స్పందించారు. తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నివేదికనిచ్చిందని, అయినా సరే టీడీపీ దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టిందని విమర్శించారు.
అవి తీయమని చెప్పినందుకు తనను బూతులు తిట్టారని, దుర్భాషలాడారని, నానా హంగామా చేశారని అన్నారు. తాను చంద్రబాబును బూతులు తిట్టలేదని చెప్పారు. కేవలం తనను తిట్టిన వారినే తాను తిరిగి తిట్టానని, అలా వారిని తిట్టడం కూడా తన అంతరాత్మకు తప్పనిపించిందని అన్నారు.
అయినా సరే, ఆవేశంలో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, తిట్టకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు నుంచి ఆదేశం వచ్చిందని, తనను అరెస్ట్ చేస్తారని, ఆ విషయం తనకు తెలుసని చెప్పారు.
అయితే, ఐ డోంట్ కేర్….అరెస్ట్ చేస్తారా.. చేసుకోండి..నేను సిద్ధంగా ఉన్నా అంటూ అంబటి సవాల్ విసిరారు. అయినా, ఏపీలో చట్టం లేదని, అంతా రెడ్ బుక్ పాలనేనని, పోలీస్ రాజ్యంగమే నడుస్తోందని విమర్శించారు. తనను తిట్టి తనపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయలేదని, తనపై దాడి జరుగుతుంటే చోద్యం చూస్తూ నిలుచున్నారని ఆరోపించారు.
This post was last modified on January 31, 2026 6:11 pm
తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్లో టాలీవుడ్ సృష్టించిన…
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…
ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…
తిరువీర్.. ఈ పేరు చూసి ఇప్పటికీ ఎవరో పరభాషా నటుడు అనుకుంటూ ఉంటారు కానీ.. అతను అచ్చమైన తెలుగు కుర్రాడు. చేసినవి తక్కువ…
ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ దఫా కూడా.. సిట్…