Political News

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్ హౌస్‌లోనే విచారించాల‌న్న కేసీఆర్ విజ్ ఒప్తిని ప్ర‌త్యేక విచార‌ణ బృందం (సిట్‌) అంగీక‌రించ‌లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచార‌ణ‌కు రావాల‌ని గురువార‌మే సిట్ నోటీసులు ఇచ్చింది. దీనికి కేసీఆర్ వెంట‌నే స్పందించారు.

తాను మున్సిప‌ల్ ఎన్నిక‌ల వ్య‌వ‌హారంలో త‌ల‌మున‌క‌లై ఉన్నందున మ‌రో తేదీ ఇవ్వాల‌ని కోరారు. అందుకు సిట్ సుముఖ‌త వ్య‌క్తం చేసింది. అయితే తాజాగా కేసీఆర్ మ‌రో విన్న‌పాన్ని సిట్ అధికారుల ముందు ఉంచారు. త‌న‌ను ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్ హౌస్‌లోనే విచారించాల‌ని కోరారు. అందుకు నిరాక‌రించిన అధికారులు.. నందిన‌గ‌ర్‌లోని కేసీఆర్ నివాసంలో ఆయ‌న్ని విచారించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కేసీఆర్‌కు 160 సీఆర్పీసీ కింద మ‌రోసారి నోటీసులు ఇవ్వాల‌ని సిట్ నిర్ణ‌యించింది. ఆదివారం మ‌ధ్యాహ్నం కేసీఆర్ విచార‌ణ జ‌ర‌గొచ్చ‌ని భావిస్తున్నారు. 2014లో ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాట‌య్యాక తొలిసారి ముఖ్య‌మంత్రి అయ్యారు కేసీఆర్. ఇంకో ఐదేళ్ల త‌ర్వాత రెండో ప‌ర్యాయం అధికారంలోకి వ‌చ్చాక కేసీఆర్ ప్ర‌భుత్వ ప్రోద్బ‌లంతో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌భుత్వ అధికారులు, ఫిలిం సెల‌బ్రెటీలు, ఇంకా వివిధ రంగాల‌కు చెందిన అనేక మంది ప్ర‌ముఖుల ఫోన్ల‌ను ట్యాప్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. రెండేళ్ల కింద‌ట రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఈ వ్య‌వ‌హారం మీద ప్ర‌త్యేకంగా దృష్టిసారించింది.

కేసీఆర్, కేటీఆర్ స‌హా అనేక మంది నాయ‌కులు.. అప్ప‌టి అధికారుల మీద కేసులు పెట్టింది. సుదీర్ఘ కాలంగా ఈ కేసు విచార‌ణ జ‌రుగుతోంది. అనేక మంది నాయ‌కులు, అధికారుల‌ను సిట్ బృందం విచారించింది. ఇప్పుడు తొలిసారి కేసీఆర్ ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కాబోతున్నారు.

This post was last modified on January 30, 2026 10:03 pm

Share
Show comments
Published by
Kumar
Tags: FeatureKCR

Recent Posts

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

55 minutes ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

60 minutes ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

2 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

4 hours ago

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…

6 hours ago

సంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…

8 hours ago