ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్ సమావేశాలపై మంత్రులతో చర్చించారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు అందాయని, దీనిపై కసరత్తు కూడా పూర్తి కావొచ్చిందని అధికారులు వివరించారు. దీంతో వచ్చే నెల 11 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తే బాగుంటుందన్న సీఎం చంద్రబాబు సూచనలకు మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే ఈ సమావేశాలను ఎన్ని రోజులు జరపాలన్న విషయంపై సభ ప్రారంభించిన రోజు బీఏసీలో నిర్ణయించనున్నారు.
ఇక బడ్జెట్ సమావేశాల్లో ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2026–27 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో బడ్జెట్‌తో పాటు పలు కీలక బిల్లులను కూడా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిపై కూడా సీఎం చంద్రబాబు మంత్రివర్గంతో చర్చించారు. వీటిలో ప్రధానంగా గత కొంతకాలంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెబుతున్న అంశానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంతో పాటు వారి వేతనాలు, భత్యాలను నిలుపుదల చేసేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాల్లో ఎక్కడా క్లాజ్ లేదు. అదేవిధంగా రాజ్యాంగంలోనూ ఎక్కడా ఈ విషయాన్ని చేర్చలేదు. రాజ్యాంగ నిర్మాతలు అసలు ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారని ఊహించి ఉండరు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సభ్యులు బాధ్యతతో ఉంటారనే అంచనాతోనే వారి గైర్హాజరు, జీతాలు, భత్యాలకు సంబంధించిన అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు.
ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే ఒక బిల్లును రూపొందించి కేంద్రానికి పంపాలని తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఇది జరిగితే దేశంలో తొలిసారి ఈ తరహా బిల్లును ఆమోదించి పంపిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది. తద్వారా కేంద్రం కూడా ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని గైర్హాజరయ్యే ఎమ్మెల్యేలపై చర్యలకు అనుకూలంగా ఒక చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
This post was last modified on January 29, 2026 8:00 am
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్‌కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…