యూరోపియన్ దేశాలుగా పేరొందిన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, స్విట్జర్లాండ్, నార్వే, స్పెయిన్, ఉక్రెయిన్, పోలాండ్ సహా 25 దేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువుల ధరలు భారీగా తగ్గుముఖం పట్టనున్నాయి. గత పదేళ్లలో ఆయా దేశాలు.. 90 శాతం మేరకు భారత్‌కు ఎగుమతులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు అమెరికా అండతో .. ఆయా దేశాలు విచ్చలవిడిగా.. వస్తువుల ధరలు పెంచాయి.
కానీ, ఇప్పుడు ప్రపంచ దేశాలకు ట్రంప్ సెగ బాగా తగులుతున్న నేపథ్యంలో యూరోపియన్ దేశాలు దిగి వచ్చాయి. బారత్ వంటి అతి పెద్ద మార్కెట్‌ను కోల్పోకుండా.. తాజాగా అతి పెద్ద ఒప్పందం చేసుకున్నా యి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో జరిగిన ఈ కీలక ఒప్పందం ప్రకారం.. యూరోపియన్ దేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే.. కార్లు, దుస్తులు, మేస్ మెటల్(ముడి పదార్థాలు), మిషనరీ, రవాణా వాహనాల్లో వినియోగించే పరికరాలు.. ఇలా అన్ని ధరలు భారీగా తగ్గుముఖం పట్టనున్నాయి.
యూరోపియన్ యూనియన్‌తో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత్-ఈయూ దేశాల మధ్యకుదిరిన ఈ ఒప్పందాన్ని.. “ఒప్పం దాల్లో కెల్లా తల్లి వంటిది“ అని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ ఒప్పందం ఫలితంగా.. భారత్ సహా ఐరోపా దేశాలకు మేలు జరుగుతుందని.. ముఖ్యంగా ప్రజలకు దైనందిన అవసరాలకు వినియోగించే వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates