Political News

హమ్మయ్య.. తెలంగాణ గవర్నర్ ప్లస్సే!

బీజేపీయేతర, ఎన్డీయే కూటమియేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు, మంత్రి మండలికి మధ్య తీవ్ర వివాదాలు, విభేదాలు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో గవర్నర్లు తమ తమ ప్రసంగాలను చదవకుండానే వెళ్లిపోయారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా, వారు చేయాలని అనుకున్న పనులు చేశారు.

అయితే దీనికి భిన్నంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యవహరించి అందరినీ సంతోషపరిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యం కూడా అందరికీ తెలిసిందే. దీంతో తెలంగాణలో రాజకీయ వివాదాలు కామన్‌గా మారాయి. పైగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లును ఇప్పటికీ గవర్నర్ ఆమోదించలేదు.

ఇలాంటి వివాదాలు ఉన్నప్పటికీ, తాజాగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగ పాఠాన్ని చదవను అని చెప్పకుండా, ఆసాంతం చదివి రిపబ్లిక్ డే కార్యక్రమానికి వన్నె తెచ్చారు.

సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, సుమారు 22 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న, చేయబోతున్న కార్యక్రమాలను సంపూర్ణంగా వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజా సర్కారు అంటూ సంబోధించిన గవర్నర్, ఇటీవల తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యంగా భాగ్యనగరం స్థాయిని పెంచేలా ఈ డాక్యుమెంట్‌ను రూపొందించారని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని మూడు ఎకానమీ జోన్లుగా విభజించి మూడు కీలక రంగాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని వెల్లడించారు. మేడారం అభివృద్ధికి 251 కోట్ల రూపాయలు కేటాయించామని, రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.

ఈ విధంగా ఎలాంటి వివాదాలు లేకుండా గవర్నర్ గణతంత్ర వేడుకలను ముగించడంతో ప్రభుత్వం ఖుషీ అయ్యింది.

This post was last modified on January 27, 2026 1:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

భారీగా త‌గ్గ‌నున్న కార్లు-దుస్తుల ధ‌ర‌లు

యూరోపియ‌న్ దేశాలుగా పేరొందిన జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రిట‌న్‌, స్విట్జ‌ర్లాండ్‌, నార్వే, స్పెయిన్‌, ఉక్రెయిన్‌, పోలాండ్ స‌హా 25 దేశాల…

4 minutes ago

సంక్రాంతి హ్యాంగోవర్ నుంచి బయటికొస్తారా?

కొత్త ఏడాది ఆరంభమవుతుంటే.. తెలుగు ప్రేక్షకుల దృష్టంతా సంక్రాంతి మీదే ఉంటుంది. ఆ పండక్కి భారీ చిత్రాలు, ఎక్కువ సంఖ్యలో…

33 minutes ago

మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా

తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్…

44 minutes ago

నేను చిక్కిపోయింది అందుకేరా నాయనా: లోకేశ్

టీడీపీ కీలక నేత, మంత్రి లోకేశ్ గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా సన్నబడ్డారు. దీంతో, లోకేశ్ పక్కాగా డైట్ మెయింటైన్…

1 hour ago

గాంధీ టాక్స్… నిశ్శబ్దం చేయించే యుద్ధం

మాటలు లేకుండా సినిమాను ఊహించుకోవడం కష్టం. డైలాగులు పెట్టకుండా కేవలం సీన్స్ తో కన్విన్స్ చేయడం అసాధ్యం కాబట్టి దర్శక…

1 hour ago

‘గద్దర్ అన్నను గేటు బయట నిలబెట్టింది ఆయనే’

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ ఎస్ నేత జోగినిపల్లి సంతోష్ రావు ఈ రోజు సిట్…

4 hours ago