తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నియోజకవర్గాలు, జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అదేసమయంలో మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. దీనిని పసిగట్టిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ కూడా అదే తరహా వ్యూహంతో ముందుకు సాగేందుకు రెడీ అయింది.
ఈ క్రమంలో మునిసిపల్, కార్పొరేషన్ల కోసం సమన్వయ కమిటీలను నియమిస్తోంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను కూడా ఇందులో భాగస్వాములుగా చేస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులు వేయాలన్న పక్కా వ్యూహాన్ని అమలు చేసేందుకు బీఆర్ ఎస్ సిద్ధమవుతోంది. తాజాగా సమన్వయ కమిటీలపై పార్టీలో భారీ కసరత్తు జరుగుతోంది.
గత మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ పుంజుకుంది. మెజారిటీ స్థానాలను కూడా దక్కించుకుంది. అప్పట్లో అధికారంలో ఉండడంతో పార్టీకి ఈ వ్యవహారం నల్లేరుపై నడకలా మారింది. కానీ ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది.
అయినా కూడా తన పట్టును కోల్పోకుండా మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీఆర్ ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ను ఒక మాజీ మంత్రి లేదా మాజీ ఎమ్మెల్యే వంటి సీనియర్ నాయకుడికి అప్పగించనున్నారు.
సదరు నేతలు కార్యకర్తలను సమన్వయం చేయడం, కాంగ్రెస్ సహా ప్రత్యర్థులు వేస్తున్న వ్యూహాలను పసిగట్టి వాటికి ప్రతిగా ప్రతివ్యూహాలు రూపొందించడం వీరి ప్రధాన బాధ్యతగా ఉండనుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు వారు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది.
అభ్యర్థుల ఎంపికలోనూ కీలక పాత్ర
మునిసిపల్, కార్పొరేషన్ వార్డులకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో కూడా ఈ నేతలు కీలకంగా వ్యవహరించనున్నారు. ప్రజల్లో మంచి పేరు ఉండటంతో పాటు ప్రజలకు చేరువగా ఉన్న వారిని ఎంపిక చేసి పోటీకి దింపనున్నారు. అదే సమయంలో ప్రజల నాడిని పట్టుకుని దానికి అనుగుణంగా ఎన్నికల హామీలను ప్రకటించనున్నారు.
ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలతో పాటు గత ప్రభుత్వంలో చేసిన మంచి పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేయనున్నారు. మొత్తంగా బీఆర్ ఎస్ పార్టీ ఈ మునిసిపల్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.
This post was last modified on January 27, 2026 11:50 am
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ ఎస్ నేత జోగినిపల్లి సంతోష్ రావు ఈ రోజు సిట్…
మొన్న పొంగల్ పండక్కు విడుదలైన కార్తీ వా వాతియార్ బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్ని చవి చూసింది. జన నాయకుడు…
ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేదే ఉండదని.. అమ్మాయిలు స్ట్రిక్ట్‌గా, ప్రొఫెషనల్‌గా ఉంటే వారి జోలికి ఎవ్వరూ రారని ఇటీవల…
విజయ్ జన నాయకుడు కథ మళ్ళీ మొదటికే వచ్చింది. యు/ఏ సర్టిఫికెట్ జారీ చేయాలని సింగల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని…
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దేవర విడుదలై ఏడాదిన్నర దాటినప్పటికీ…
తెర మీద రొమాంటిక్ సీన్లు చూడడం మెజారిటీ ప్రేక్షకులకు బాగానే ఉంటుంది కానీ.. అవి చేయడం మాత్రం నటీనటులకు చాలా…