“బీజేపీ పరంగా మేం రాజధాని అమరావతికే కట్టుబడి ఉన్నాం. మూడు రాజధానుల నిర్ణయానికి మేం వ్యతిరేకం”- ఇదీ తాజాగా ఏపీ బీజేపీ చీఫ్.. సోము వీర్రాజు నోటి నుంచి జాలువారిన కీలక ప్రకటన. నేరుగా ఆయన అమరావతి రైతుల మధ్యకే వెళ్లి.. ఈ విషయాన్ని చెప్పారు. ఒక రకంగా.. ఇది రైతుల్లో ఉత్సాహం నింపేదే! అయితే.. దీనిలో నిజమెంత? రాబోయే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను దృష్టి పెట్టుకుని చేసిన ప్రకటనా? లేక.. నిజంగానే రాజధానిపై సోముకు వీరావేశం పొంగుకు వచ్చిందా? అనేదే ఇప్పుడు సంశయంగా మారింది. సోము వంటి ఆర్ ఎస్ ఎస్ భావజాలం గూడుకట్టుకున్న నేత నోటి నుంచి వచ్చిన దీనిని తేలికగా తీసుకునే అవకాశం లేదు.
అయితే.. నిజమైనా అయి ఉండాలి. లేదా.. రాజకీయ ఎత్తుగడ అయినా.. అయి ఉండాలి.. అంటున్నారు పరిశీలకులు. దీనిలో రెండోదానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు ఇప్పటికే ఏపీ రాజధాని విషయంలో స్పష్టమైన ప్రకటనను లిఖిత పూర్వకంగా అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తేల్చిచెప్పారు. విభజన చట్టంలోని ఏ క్యాపిటల్
అని ఉందని.. ఏ
అంటే..ఒకటే అని అనుకోవాల్సిన అవసరం లేదని పరోక్షంగా మూడుకు తలగొక్కారు. అప్పట్లో ఇది తీవ్ర గందరగోళానికి గురి చేసింది. దీనిపై రాజధాని రైతులు తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే.. ఆ సమయంలో మౌనంగా ఉన్న సోము.. ఇప్పుడు మాత్రం రాజధానికి తాము ఓకే అంటూ.. పచ్చ జెండా ఊపారు.
ఒక వేళ.. సోము చేసిన ప్రకటనలో రాజకీయ ఎత్తుగడ ఉండి ఉంటే.. ఖచ్చితంగా పార్టీ మరింతగా భ్రష్టు పడుతుంది. ఇప్పటికే ప్రత్యేక హోదాకు కేంద్రం మంగళం పాడింది. నిధుల విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఇది ఏపీ ప్రజల సెంటిమెంటును తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇక, ఇప్పుడు రాజధాని విషయంలో కేంద్రం ఒక పాట పాడితే.. సోము మరో ఎత్తుగడ ఎత్తుకున్నారు.
రాజధానిగా ఆయన అమరావతి ఉండాలని నిజమైన ఆకాంక్ష ఉంటే.. ఖచ్చితంగా ఆయనకేంద్ర పెద్దలను ఒప్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. కేంద్ర పెద్దలు ఈ విషయంలో అచేతనంగా ఉన్నారు. సో.. దీనిని బట్టి రాజధాని కోసం.. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యతను సోము తీసుకుని.. ఇక్కడ ప్రజల కలలను ఆయన సాకారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది జరిగినప్పుడే.. సోము చేసిన వ్యాఖ్యలపై నమ్మకం కలుగుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on December 15, 2020 10:26 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…