ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి శాశ్వతమని, దీనిని ఎవరూ కదల్చలేరని ఆయన స్పష్టం చేశారు. నగరి నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో అమరావతి రాజధాని అంశంపై చంద్రబాబు మాట్లాడారు.
రాజధానిని కదపడం ఎవరి వల్లా కాదన్నారు. రైతుల త్యాగాలతో ఏర్పడిన రాజధానిని పటిష్ఠం చేస్తున్నామని చెప్పారు. ఎన్ని కుయుక్తులు పన్నినా రాజధాని పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. అమరావతే ఏపీ శాశ్వత రాజధానిగా చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.
ఎందుకు?
అమరావతిపై సీఎం చంద్రబాబు ఇలా కీలక ప్రకటన చేయడం వెనుక ముఖ్యమైన కారణం ఉందని సమాచారం. శనివారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. సోమవారం నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేసిన ఏర్పాట్లపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మంత్రివర్గం చర్చించింది.
ఈ క్రమంలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై కూడా కేంద్ర మంత్రివర్గం దృష్టి పెట్టింది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై చర్చ జరిగిందని సమాచారం. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఒక్కటే ఆమోదం తెలపాల్సి ఉంది.
ఇది కూడా త్వరలోనే పూర్తవుతుందని తెలుస్తోంది. ఇదే శనివారం కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఏపీలో పర్యటించారు. బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అమరావతి అంశంపై మరోసారి చర్చ జరిగింది.
ఈ మొత్తం పరిణామాలు ముందుగానే చంద్రబాబుకు తెలిసిన నేపథ్యంలోనే ఆయన అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. చట్టబద్ధత కల్పిస్తే రాజధానిని ఎవరూ కదిలించలేరన్న అభిప్రాయం ప్రభుత్వం, ప్రజల్లో బలంగా ఉంది. అందుకే అమరావతిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
This post was last modified on January 25, 2026 3:33 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆధ్మాత్మిక చింతన ఎక్కువన్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 131 మందికి పద్మ అవార్డుల దక్కాయి. ఐదుగురికి…
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ…
ఏ ముహుర్తంలో డొనాల్డ్ ట్రంప్ ను రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా అమెరికన్లు ఎన్నుకున్నారో కానీ.. అప్పటి నుంచి ప్రపంచ దేశాలకు…
మన దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మశ్రీ ఒకటి. కళలు, విద్య, వైద్యం, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక…
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్…