Political News

సుజ‌నా ఆద‌ర్శం… ఫ‌స్ట్ టైమ్ విజ‌య‌వాడ‌లో!

రాజ‌కీయాల‌కు కీల‌క‌మైన విజ‌య‌వాడ‌లో నాయ‌కుల దూకుడు ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ విష‌యంలో ఎవరికీ సందేహం లేదు. అయితే.. కేవ‌లం మాట‌ల‌కేనా?  ప‌నుల‌కు ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే.. ముందు మాట‌లు.. త‌ర్వాతే ప‌నులు అన్న‌ట్టుగా నాయ‌కులు ఇక్క‌డ వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. కానీ.. దీనికి భిన్నంగా తొలిసారి విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి కీల‌క కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి ఆయ‌న అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అంటేనే ముస్లిం మైనారిటీలు ఎక్కువ‌గా ఉంటారు. అలాంటి చోట బీజేపీ రెండో సారి విజ‌యం ద‌క్కించుకుంది. తాజా విజ‌యం త‌ర్వాత‌.. బీజేపీ వెన‌క్కి తిరిగి చూసుకోకుండా.. వ్య‌వ‌హ‌రించేలా ఎమ్మెల్యే సుజ‌నా కార్యాచ‌ర‌ణ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రిస్తూ.. ఆయ‌న తొలి నాళ్ల‌లోనే ఇక్క‌డివారిని ఆక‌ట్టుకున్నారు.

ఇక‌, ఇప్పుడు మొబైల్ ఆసుప‌త్రిని ఆయ‌న అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో కొండ ప్రాంతాలు ఎక్కువ‌. ఇక్క‌డి వారికి ఏ చిన్న వైద్య అవ‌స‌రం వ‌చ్చినా.. కిలో మీట‌ర్ల దూరం వెళ్లాల్సి వ‌స్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇంటి ముందుకే అధునాతన వైద్యం అందించేలా సుజ‌నా ఫౌండేష‌న్ స‌హ‌కారంతో ఎమ్మెల్యే మొబైల్ ఆసుప‌త్రికి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ఉద‌యం 6 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఇది సేవ‌లందించ‌నుంది.

ప్ర‌తి వార్డులోనూ రెండు నుంచి మూడు గంట‌ల‌పాటు ఈ వాహ‌నాన్ని నిలిపి వుంచుతారు. దీనిలో షుగ‌ర్‌, బీపీ, కిడ్నీ టెస్టుల నుంచి ఇత‌ర మ‌లేరియా జ్వ‌రాలు.. చిన్న‌పాటి రోగాల‌ను న‌యం చేసేలా వైద్య స‌దుపాయాలు అందుబాటులో ఉంచారు. ఈసీజీ కూడా తీస్తారు.

దీనిని ముఖ్యంగా పేద‌లు, తెల్ల‌రేష‌న్ కార్డు ఉన్న వారికి అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్టు ఎమ్మెల్యే చెబుతున్నారు. నిజానికి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ఆలోచ‌న ఎవ‌రూ చేయ‌క‌పోవ‌డంతో ఎమ్మెల్యే ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on January 24, 2026 6:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

షారుఖ్ ‘కింగ్’ కథకు ప్రొఫెషనల్ స్ఫూర్తి

బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు జవాన్, పఠాన్, డంకీ ఇచ్చిన షారుఖ్ ఖాన్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని…

3 hours ago

పెద్ది నిర్ణయం మారితే లాభమా నష్టమా

మార్చి 27 విడుదల కావాల్సిన పెద్ది వాయిదా ప్రచారం మరింత బలపడుతోంది. టీమ్ ఖండించడం లేదు కానీ డేట్ లో…

5 hours ago

ఈ ఐఏఎస్‌… ఐపీఎస్‌… ఎంత సింపులంటే

పెళ్లంటే ఆడంబ‌రాల‌కు మారు పేరుగా మారిపోయిన రోజులు ఇవి. ఎవ‌రు ఎక్కువ ఖ‌ర్చు పెడితే.. ఎంత ఘ‌నంగా చేసుకుంటే అంత…

7 hours ago

టీడీపీలో కోవర్టులు: చింతమనేని

టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. స్వపక్షమైనా, విపక్షమైనా…

8 hours ago

రాష్ట్రానికి జగన్ ఇచ్చిన ఆస్తి

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు సెట‌ర్లు పేల్చారు. ``జ‌గ‌న్ ఈ రాష్ట్రానికి గొప్ప ఆస్తి ఇచ్చాడు. నేను కూడా…

9 hours ago

మరో క్రికెటర్ బయోపిక్ వస్తోందహో…

భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది గొప్ప కెప్టెన్లు ఉన్నారు. కానీ ఆ అందరిలో భారత క్రికెట్‌ను అత్యంత గొప్ప మలుపు…

10 hours ago