Political News

బొమ్మల వివాదం తర్వాత కూడా మారని జగన్ వైఖరి

రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వేపై వైసీపీ అధినేత జగన్ తనదైన శైలిలో స్పందించారు. ఎరా ఎయ్యి పడితే ఆరాయితో సరిహద్దులు నిర్ణయిస్తున్నారని, ఇదేం సర్వే అని ప్రశ్నించారు. అయితే వాస్తవంగా వైసీపీ హయాంలోనే సర్వే రాళ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. సర్వే రాళ్ల కోసం సుమారు 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో పాటు ఖరీదైన గ్రానైట్ రాయిని వినియోగించడం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది.

అంతేకాదు, ఆ సర్వే రాళ్లపై జగన్ ఫొటోలను కూడా ముద్రించారు. దీనిపై హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. భూముల రీ సర్వేకు సంబంధించి రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలపై కూడా జగన్ బొమ్మ ఉండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు, తాము అధికారంలోకి వస్తే రీ సర్వేను పారదర్శకంగా చేపడతామని, పాస్ పుస్తకాలపై ఉన్న బొమ్మలను తొలగిస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖరీదైన సర్వే రాళ్లను తొలగించి సాధారణ రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను తొలగించి ప్రభుత్వ రాజముద్రను ముద్రించారు. దీంతో రీ సర్వే ప్రక్రియ మరింత స్పష్టంగా, నమ్మకంగా సాగుతోందని రైతులు చెబుతున్నారు.

ఇక గతంలో జరిగిన తప్పులను కూడా సరిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా కూడా జగన్ ఇప్పుడు సరిహద్దు రాళ్లు సరిగా లేవని, పాస్ పుస్తకాలు సరిగ్గా లేవని వ్యాఖ్యానించడం గమనార్హం.

రీ సర్వే అనేది కేంద్ర ప్రభుత్వ స్థాయి కార్యక్రమం. ఇది దేశవ్యాప్తంగా అమలులో ఉంది. తెలంగాణలో భూ భారతి పేరుతో, ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ పేరుతో ఈ ప్రక్రియను గతంలో చేపట్టారు. ప్రస్తుతం రీ సర్వే పేరుతో కొనసాగిస్తున్నారు. అయినా జగన్ మాత్రం ఈ పథకం తన ఆలోచనతోనే వచ్చిందని, తానే దీనికి రూపకల్పన చేశానని చెప్పడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది.

This post was last modified on January 22, 2026 9:51 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

న్యూజిలాండ్ లో ఒక్కడు… RCB ఫుల్ హ్యాపీ!

నాగ్‌పూర్ వేదికగా జరిగిన మొదటి టీ20లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించి 238 పరుగులు బాదినా, న్యూజిలాండ్ బౌలర్ జాకబ్…

30 minutes ago

అఖండ 2, రాజాసాబ్… రెండిటిలో ఒకే తప్పు!

ఇటీవల వచ్చిన 'ది రాజా సాబ్', గత ఏడాది చివర్లో వచ్చిన 'అఖండ 2'.. రెండు సినిమాలు కూడా పక్కా…

1 hour ago

రాను రానంటూనే… విజయసాయి పొలిటికల్ రీ ఎంట్రీ!

తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన.. ఏ పార్టీలోకి నేను చేరడం లేదంటూనే విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు…

2 hours ago

స్టార్ తో చెడినా… క్రేజీ లైనప్‌తో డైరెక్టర్

కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సుందర్ సి ఈమధ్య కాలంలో కమర్షియల్ గా మంచి ట్రాక్ లో వెళుతున్నాడు. గతేడాది కమల్…

2 hours ago

చైతు లవ్ స్టోరీకి సరైన సమయం

నాగ చైతన్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయిన లవ్ స్టోరీని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా రీ…

4 hours ago

ఆదర్శ కుటుంబం… ఎందుకీ సీక్రెట్?

విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం (AK47)' ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో…

4 hours ago