Political News

ఐ-ప్యాక్ ‘మిస్టరీ’ లోన్: రూ.13.5 కోట్ల అసలు కథేంటి?

ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. 2021లో ఈ సంస్థ హర్యానాలోని రోహ్‌తక్ కేంద్రంగా ఉన్న ఒక కంపెనీ నుంచి రూ. 13.5 కోట్ల అన్‌సెక్యూర్డ్ లోన్ పొందినట్లు తన ఆర్థిక నివేదికల్లో పేర్కొంది. అయితే, ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ అప్పు ఇచ్చిన కంపెనీ మూడేళ్ల ముందే మూతపడిపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

ఐ-ప్యాక్ తన ఫైలింగ్స్‌లో లోన్ ఇచ్చిన సంస్థ పేరును ‘రామసేతు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా (పి) లిమిటెడ్’ అని పేర్కొంది. కానీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) డేటాలో ఈ పేరుతో ఎలాంటి యాక్టివ్ సంస్థ కనిపించడం లేదు. దానికి దగ్గర పేరుతో ఉన్న ‘రామ్ సేతు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీ రికార్డులను పరిశీలిస్తే, అది 2013లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కేవలం 5 లక్షల మూలధనంతో ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ రామ్ సేతు కంపెనీ తన కార్యకలాపాలను నిర్వహించడంలో విఫలం కావడంతో కంపెనీల చట్టం ప్రకారం 2018 ఆగస్టు 18 నాడే ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అంటే అధికారికంగా ఉనికిలో లేని కంపెనీ నుంచి ఐ-ప్యాక్ సుమారు మూడు ఏళ్ల తర్వాత 2021లో 13.5 కోట్ల భారీ రుణాన్ని ఎలా పొందిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.

ఈ విషయంపై లోతుగా ఆరా తీయగా మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. సదరు కంపెనీ కాంటాక్ట్ నంబర్‌కు ఫోన్ చేస్తే, అది తనది కాదని ముఖేష్ అనే వ్యక్తి సమాధానమిచినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అలాగే ఆ కంపెనీకి గతంలో యజమానులుగా ఉన్న వ్యక్తులు కూడా తమకు ఐ ప్యాక్ తో ఎలాంటి సంబంధం లేదని, అసలు లోన్ ఇవ్వడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ఐ-ప్యాక్ ఇప్పటికే ఈ రుణంలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నా, అసలు అప్పు ఇచ్చిన సంస్థ గుర్తింపుపై క్లారిటీ లేదు.

ఐ-ప్యాక్ సమర్పించిన నివేదికలకు, ప్రభుత్వ రికార్డులకు మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసం నిధుల మూలంపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? నివేదికల్లో తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారు? అనే ప్రశ్నలపై ఐ-ప్యాక్ ఇప్పటి వరకు ఎలాంటి బహిరంగ వివరణ ఇవ్వలేదు. ఈ ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న అసలు రహస్యం దర్యాప్తులో తేలాల్సి ఉంది.

This post was last modified on January 22, 2026 3:12 pm

Share

Recent Posts

తొమ్మిది డ్రాఫ్టులు… మూడు క్లైమాక్స్‌లు

మొదట నటుడిగా పరిచయం అయిన వెంకీ అట్లూరి.. తర్వాత దర్శకుడిగా మారుతుంటే తనలో ఈ టాలెంట్ కూడా ఉందా అని…

2 hours ago

రామాయణ ట్రైలర్… వర్త్ ఉందా వర్మా

నాలుగు వేల కోట్లతో తీశామని గతంలో రామాయణ గురించి గర్వంగా చెప్పుకున్న నిర్మాత నమిత్ మల్హోత్రా తర్వాత ఆ మాట…

2 hours ago

డిజాస్టర్ టాక్‌తో బ్లాక్‌బస్టర్‌ను దాటేస్తున్నాడు

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మించిన హీరో రావడం అసాధ్యం అనుకున్నారంతా. ఒకప్పుడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఆ…

8 hours ago

దేశముదురు చేయకపోవడమే మంచిదైంది

ఫిలిం ఇండస్ట్రీలో ఒక కథ వేర్వేరు చోట్లకు ప్రయాణించి.. చివరగా ఒక హీరో దగ్గర ఓకే అయి పట్టాలెక్కడం చాలా…

12 hours ago

ఒకటవ తేదీకే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు

గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అయిపొయింది. జగన్ ప్రభుత్వ హయాంలో…

12 hours ago

ఆదర్శ కుటుంబానికి తమన్ ఎలివేషన్

త్రివిక్రమ్ రచయితగా ఉన్న రోజుల్లో విక్టరీ వెంకటేష్‌తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి మరపురాని చిత్రాలను అందించాడు. కానీ…

14 hours ago