Political News

సాగరం నుంచి శిఖరం వరకు… వైసీపీని మ‌రిపిస్తున్న స‌ర్కారు!

పాల‌న అంటే..కేవ‌లం నాలుగు సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. రెండు అభివృద్ధి ప్రాజెక్టులేనా? అంటే.. ప్ర‌జ‌ల కోణంలో చూసుకుంటే.. కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంది. అభివృద్ధి, సంక్షేమాల‌తోపాటు.. ఒకింత వినోదం, వేడుక‌లు కూడా ఉండాల‌ని భావిస్తారు. ఈ విష‌యంలో గ‌త ఐదేళ్ల‌లో వైసీపీ మూతి ముడుచుకుని కూర్చుంది. ఎక్క‌డా ఒక్క ఈవెంట్ కూడా నిర్వ‌హించ‌లేదు. ఎవ‌రైనా ఈవెంట్లు చేసుకునేందుకు ముందుకు వ‌చ్చినా.. వారిని కూడా త‌రిమేసింది. దీంతో ప్ర‌జ‌ల‌కు గ‌త ఐదేళ్లు.. వినోదం-వేడుక అనే మాటే వినిపించ‌కుండా పోయింది.

అయితే. కూట‌మి స‌ర్కారు… మాత్రం గ‌త 18 మాసాల్లో ప్ర‌జ‌ల‌కు ఇటు సంక్షేమం(సూప‌ర్ సిక్స్‌), అటు అభివృద్ధి(అమ‌రావ‌తి, పోల‌వ‌రం ప్రాజెక్టులు స‌హా ఇత‌ర ప్రాజెక్టుల నిర్మాణం)తోపాటు వినోదాన్ని, వేడుక‌ల‌ను కూడా చేరువ చేస్తోంది. న‌గ‌రాలు, ప‌ట్టణాల వారీగా ఈకార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగానే.. గ‌త ఏడాది ‘విజ‌య‌వాడ ఉత్స‌వ్‌’, తిరుప‌తిలోనూ వేడుక‌లు నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత‌.. ఏదో ఒక రూపంలో ప్ర‌తి చోటా ప్ర‌జ‌ల‌కు వేడుక పంచేకార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఇక‌, ఇప్పుడు అదిరిపోయేలా మ‌రో వేడుక‌కు కూట‌మి ప్ర‌భుత్వం రెడీ అయింది.

ఇది పూర్తిగా ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల‌కు ఉద్దేశించిన కార్య‌క్ర‌మ‌మే అయినా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌నున్నారు. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ‘విశాఖ ఉత్సవ్’ పేరుతో ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని మూడు ప్రాంతాల్లో వేడుక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ‘సాగరం నుంచి శిఖరం వరకు’ అనే థీమ్‌తో ఈ నెల‌ 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని విశాఖ‌, అన‌కాప‌ల్లి, అర‌కు లోయ ప్రాంతాల్లో దీనిని నిర్వ‌హిస్తున్నారు..

ఇవీ విశేషాలు..

  • మొత్తం 20 ప్రధాన వేదికలపై 500కు పైగా సాంస్కృతిక, పర్యాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు.
  • విశాఖపట్నంలో ప్రారంభమ‌య్యే వేడుకలు ఫిబ్రవరి 1న అనకాపల్లిలో ముగియ‌నున్నాయి.
  • తీరప్రాంత పర్యాటకం నుంచి మన్యం ప్రాంతపు గిరిజన సంస్కృతి వరకు ఇవి వేదిక‌లు కానున్నాయి.
  • సుమారు 3000 మంది స్థానిక కళాకారులు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
  • బీచ్‌లలో డ్రోన్ షోలు, బీచ్ స్పోర్ట్స్, ఫ్లవర్ షో, మిస్ వైజాగ్ పోటీలు నిర్వ‌హిస్తారు.
  • అరకు, లంబసింగి ప్రాంతాలలో గిరిజన సంప్రదాయ నృత్యాలు, హస్తకళల ప్రదర్శన ఉంటాయి.

This post was last modified on January 22, 2026 11:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్యాపింగ్ కేసు… హరీశ్ తర్వాత కేటీఆర్ వంతు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.…

14 minutes ago

వాహ్.. వీర మహిళా కానిస్టేబుల్ తో హోం మంత్రి లంచ్

నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉంటారు. విధి నిర్వహణలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా పనిచేసి ఇటు ప్రజల..అటు…

16 minutes ago

విజయ్ పార్టీకి అదిరిపోయే గుర్తు

తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి…

1 hour ago

ఐ-ప్యాక్ ‘మిస్టరీ’ లోన్: రూ.13.5 కోట్ల అసలు కథేంటి?

ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. 2021లో ఈ సంస్థ హర్యానాలోని…

1 hour ago

కష్టాల కడలిలో నాయకుడి ఎదురీత

రాజకీయ రంగప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి కష్టాల కడలి అంత సులభంగా…

2 hours ago

పెద్ది మనసు నిజంగా మారిందా

మార్చి 27 విడుదలని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన పెద్ది ఖచ్చితంగా వాయిదా పడుతుందనే రీతిలో సోషల్ మీడియాలో ఒక…

3 hours ago