“సర్.. ఉద్యోగం వదిలేసి వచ్చా. 25 ఏళ్లుగా పార్టీలో ఉన్నా.. నన్ను కొంచెం చూడండి సర్” అని ఒకరు. “గత ఎన్నికల్లో టికెట్ కూడా వదిలేశా. ఇప్పుడు కూడా మీరు పట్టించుకోకపోతే.. నియోజకవర్గంలో మొహం చూపించలేను.” అని మరొకరు!.. ఇలా.. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు.. పలువురు నాయకులు.. గోడు వెళ్లబోసుకున్నారు. గత ఆదివారం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతిలో పాల్గొన్నారు.
అనంతరం పార్టీ సీనియర్లు.. ఆయనను అంతర్గతంగా వన్ – టు – వన్ కలుసుకున్నారు. తమ సమస్యలు చెప్పుకొచ్చారు. ఇదేసమయంలో తమ మనసులోని మాటను కూడా అధినేతకు వివరించారు. కొందరు నాయకులు నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావించారు. మరికొందరు వ్యక్తిగత డిమాండ్లను సునిశితంగా చంద్రబాబు ముందు ఉంచారు. ఇంతకీ.. వీరి ఆవేదన.. ఆకాంక్ష ఒక్కటే.. త్వరలోనే ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లను దక్కించుకోవడమే.
కానీ.. పైకి మాత్రం ఈ డిమాండ్‌ను నేరుగా చంద్రబాబు ముందు ఉంచరు. కానీ, పరోక్షంగా మాత్రం తమ ప్రతిభను వెలికి తీసి.. చంద్రబాబు ముందు పెట్టారు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. ఎవరికి వారు మౌనంగా చంద్రబాబును కలిసి .. బయటకు వచ్చారు. రెండు రోజుల తర్వాత.. ఈ వ్యవహారం వెలుగు చూసింది. రాజ్యసభ సీట్లు నాలుగు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగులో రెండు కనీసం టీడీపీకి దక్కే అవకాశం ఉంది.
వీటిని దక్కించుకునేందుకు ఇటు కమ్మ సామాజిక వర్గంలో నలుగురు కీలక నాయకులు పోటీలో ఉన్నారు. ఇదేసమయంలో మరో ఎస్సీ నాయకుడు, గతంలో పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి టీడీపీలోకి వచ్చిన వారు ఉన్నారు. ఈయన గతంలోనూ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అయినా.. తనకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ఇక, కమ్మ నేతల్లో మాజీ మంత్రి ఒకరు బలంగానే తన డిమాండ్‌ను వినిపించారు. కానీ, పైకి మాత్రం ఏమీ తెలియని నాయకులుగా వ్యవహరిస్తున్నారని టీడీపీలో చర్చ సాగుతోంది.
This post was last modified on January 21, 2026 1:00 pm
మరో పాదయాత్రకు మాజీ సీఎం జగన్ సిద్ధం అవుతున్నారు. ఎన్నికలకు ముందు ఆయన ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్నారు. దీనిపై…
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ప్రసంగించిన రేవత్ రెడ్డి కీలక సూచన చేశారు. ఇకపై, ప్రతి సంవత్సరం జూలై…
కేరళలో జరిగిన దీపక్ ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన…
తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు నిర్మాతల్లోనే కాదు వివిధ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిర్మాతలు తొంభై…
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత, మాజీ…
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం మొదలైన తీరు.. బరిలో నిలిచిన తొలి ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు చూశాక.. ఆయన మీద…