నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో ఇద్దరూ గత 79 రోజులుగా విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. అయితే మరో కేసు పెండింగ్‌లో ఉండటంతో, బెయిల్ వచ్చినప్పటికీ జైలు నుంచి వెంటనే విడుదలయ్యే పరిస్థితి లేదు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నమోదైన మరో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఇంకా నిందితుడిగా ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 3న ఎక్సైజ్ అధికారులు అక్కడ దాదాపు రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం, 40 స్పిరిట్ క్యాన్లు, 17,224 మద్యం సీసాలు, ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు, మూతలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కూడా బెయిల్ లభించినప్పుడే జోగి రమేష్ జైలు నుంచి విడుదల అవుతారని అధికారులు స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో ఏ1 నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు, జోగి రమేష్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం దందా ప్రారంభించినట్లు విచారణలో వెల్లడించినట్టు సిట్ పేర్కొంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడం, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కుట్ర జరిగిందని ఆరోపించింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో 2025 నవంబర్ 2న జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
This post was last modified on January 20, 2026 5:25 pm
సంక్రాంతి పండుగ తెలుగు వారికే కాదు.. తమిళులకూ చాలా స్పెషల్. అక్కడ కూడా పది రోజుల పాటు సెలవులుంటాయి. దీంతో…
ఒకప్పుడంటే మెగాస్టార్ చిరంజీవిని, ఆయన సినిమాలను అల్లు అర్జున్ కొనియాడడం పెద్ద విశేషంగా అనిపించేది కాదు. కానీ గత కొన్నేళ్లలో…
ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో…
కేరళ రాష్ట్రంలో ఇప్పుడొక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం…
టాలీవుడ్ లో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత తీవ్రంగా ఉంది. అందులోనూ తమ భుజాల మీద సినిమాను మోసి నిలబెట్టే…
టాలీవుడ్ కోరుకున్న శుభారంభం 2026కి దొరికేసింది. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో నాలుగు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాక మన శంకరవరప్రసాద్…