వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం నేరుగా స్పందించారు. నదీగర్భంలో రాజధానిని నిర్మిస్తున్నారని, రెండో విడత భూములు సేకరిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తిప్పికొట్టారు.
జగన్‌కు నాగరికత తెలియదని మండిపడ్డ చంద్రబాబు, నదుల ఒడ్డునే నాగరికత విలసిల్లిందన్న కనీస జ్ఞానం కూడా ఆయనకు లేదన్నారు. అందుకే మిడిమిడి జ్ఞానంతో అమరావతిపై వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతిపై జగన్ చేసే వ్యాఖ్యలను ఎవ్వరూ నమ్మబోరని, పైగా ప్రజలు నవ్వుతున్నారని చెప్పారు.
“సింధు నది నుంచే సింధు నాగరికత వచ్చింది. నైలు నది నుంచి నైలు నాగరికత వచ్చింది. ఈ విషయాలు కూడా తెలియకపోతే ఆ మనిషిని ఏమనాలి. ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో ఆయనే చెప్పాలి” అంటూ చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింధు నాగరికతపై జగన్ పాఠాలు నేర్చుకుంటే మంచిదని సూచించారు.
మన దేశ రాజధాని ఢిల్లీ కూడా యమునా నది పక్కనే ఉందని గుర్తు చేశారు. నదుల వెంబడి ఉండటమే ఆయా నగరాలకు, ప్రాంతాలకు గుర్తింపు తెచ్చిందని, అభివృద్ధి కూడా వేగంగా జరిగిందని చంద్రబాబు వివరించారు.
ఇదే సందర్భంలో జగన్‌పై మరో కీలక వ్యాఖ్య చేశారు. నదీగర్భం (రివర్ బెడ్), నదీ పరివాహక ప్రాంతం (రివర్ బేసిన్) మధ్య తేడా కూడా తెలియదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా జగన్‌కు జ్ఞానం రావడం లేదని విమర్శించారు. ఇంకా అమరావతిపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.
ఎంత మంది సైంధవులు, కీచకులు అడ్డుపడ్డా రాజధాని నిర్మాణాన్ని ఆపలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి రైతులకు మేలు చేయడం, వారి ఆకాంక్షలు తీర్చడం తన బాధ్యత అని తెలిపారు. ఈ విషయంలో రైతులను తప్పుదోవ పట్టించే వారిని రాజకీయంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.
ఇరు రాష్ట్రాలు..
జల వివాదాలపై సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించుకోవాలంటే కలిసి కూర్చుని చర్చించుకోవడం మంచిదని సూచించారు. ఇరు రాష్ట్రాలు తనకు ముఖ్యమేనని చెబుతూ, గోదావరి నుంచి వృథాగా పోతున్న నీటిని వినియోగించి రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు చేద్దామని అన్నారు.
రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో నీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుపై గతంలో అనేక విమర్శలు చేశారని, కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టు కారణంగా సీమ ప్రాంతాలకు నీరు అందుతోందని చెప్పారు. గోదావరి నీటిని సద్వినియోగం చేస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
This post was last modified on January 10, 2026 10:23 pm
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…