పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన పాలన. అదే పని చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పిఠాపురం కాలనీల్లో నడుచుకుంటూ వెళ్లి డ్రైనేజీ, చెత్త సమస్యలను స్వయంగా పరిశీలించారు. ప్రజలు చెప్పిన ఇబ్బందులను విని, వెంటనే పరిష్కారం కావాలని అధికారులకు స్పష్టం చేశారు.
పిఠాపురంలో కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, శుభ్రం కాని డ్రైనేజీ ప్రజల జీవనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పరిస్థితిని చూసి పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “నన్ను చీపురు పట్టుకుని రోడ్లు తుడవమంటారా?” అన్న ఆయన మాటలు అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపించాయి.
ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అందించడంలో మున్సిపల్ యంత్రాంగం విఫలమైందని పవన్ స్పష్టం చేశారు. ‘గుడ్ మార్నింగ్ పిఠాపురం’ వంటి కార్యక్రమాలు ఉన్నా, అవి కాగితాలకే పరిమితమవుతున్నాయని ప్రశ్నించారు. పిఠాపురం అభివృద్ధి కోసం పాడా ఏర్పాటు చేసినా, పనులు వేగంగా జరగకపోతే ప్రయోజనం ఉండదని చెప్పారు.
తన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే, ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికారులు బాధ్యతగా పనిచేయకపోతే ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుందని పవన్ హెచ్చరించారు.
This post was last modified on January 10, 2026 10:21 am
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్‌లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…