ఏపీ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత ఇటీవల తరచుగా వీడియోలు విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన టీడీపీ, వైసీపీలను ఉద్దేశించి ఒక రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడారు. ఒక్క తప్పు కారణంగా తాను హీరో నుంచి విలన్‌గా మారిపోయానని ఆయన గతంలో పేర్కొన్నారు.
తప్పు చేశానన్న భావనతోనే వాలంటరీ రిటైర్మెంట్‌కు దరఖాస్తు చేసినట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో, “ప్రభుత్వ ఉద్యోగులపై రాజకీయ విచ్ హంటింగ్ ఒక క్యాన్సర్ లాంటిది” అని అభిప్రాయపడ్డారు. దీనిని నిర్మూలించేందుకు టీడీపీ, వైసీపీ కలిసి పనిచేయాలని కోరారు.
గతంలో రాజకీయ విచ్ హంటింగ్ బారిన పడిన వారు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉండేవారని చెప్పారు. వారిలో ఒకరు అప్పటి ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ అని పేర్కొన్నారు. 2014–19 మధ్య ఈ సంఖ్య పది మందికి చేరిందని, ఇందులో ప్రధానంగా ప్రభావితమైన అధికారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అని తెలిపారు.
ఆ తరువాత కాలంలో ఈ సంఖ్య పదింతలు పెరిగిందని అన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే, రాజకీయ విచ్ హంటింగ్‌కు గురయ్యే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇది క్యాన్సర్ మహమ్మారి లాంటిదని వ్యాఖ్యానించారు. తర్వాత మళ్లీ ప్రభుత్వం మారితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఈ పరిస్థితికి చెక్ పెట్టాల్సిన బాధ్యత టీడీపీ, వైసీపీ పార్టీలదేనని ఆయన స్పష్టం చేశారు. ఒక ఉన్నతాధికారికి సంబంధించిన చిన్న పొరపాటును పెద్దదిగా చూపించి రాజకీయంగా వేటాడడం మంచిది కాదని అన్నారు.
గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంతమందిపై తాను వ్యవహరించిన తీరు పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ఆయన, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌లకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. మరోసారి కూడా ఏబీ వెంకటేశ్వరరావు పేరును ఆయన ప్రస్తావించారు.
This post was last modified on January 7, 2026 6:48 pm
మన శంకరవరప్రసాదుగారులోని చివరి పాట వచ్చేసింది. ముందు నుంచి దీని గురించి ఓ రేంజ్ లో చెబుతూ వచ్చిన టీమ్…
ప్రభాస్ హీరోగా మారుతి రూపొందించిన రాజాసాబ్ డిసెంబరు 5నే రిలీజ్ కావాల్సింది. కానీ సంక్రాంతి సీజన్ అయితే బాగుంటుందని ఈ…
చాలా గ్యాప్ తర్వాత సమంతా ఫుల్ లెన్త్ మూవీతో రాబోతోంది. తనే నిర్మించిన శుభంలో చిన్న క్యామియో చేసినప్పటికీ అది…
తెలుగులో ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా.. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ముందుండే హీరో విక్టరీ వెంకటేష్. ప్రతి సినిమాలో హీరోయిజమే ఉండాలని..…
భయపడినంతా అయ్యింది. రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడుకి ఇంకా అడ్డంకులు తొలగలేదు. సెన్సార్ సర్టిఫికెట్…
సంక్రాంతి పోటీలో అండర్ డాగ్ ఫీలింగ్ కలిగిస్తున్న సినిమాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మీద మెల్లగా అంచనాలు పెరిగేలా ప్రమోషనల్…